తొలినాళ్లలో ఎంతో కష్టపడాల్సి వచ్చింది: తృప్తి
2 months ago | 5 Views
'యానిమల్’ సినిమాలో నటించి విశేష క్రేజ్ సొంతం చేసుకున్నారు త్రిప్తి డివ్రిూ. తన అందచందాలతో యూత్ ఆడియన్స్‌ను కట్టిపడేశారు. ఇటీవల 'బ్యాడ్ న్యూజ్’ అంటూ విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తనకు నటన గురించి ఏం తెలియదన్నారు. చదువులో రాణించలేకపోయాను. దీంతో మోడలింగ్ వైపు రావాలని నిర్ణయించుకున్నా. ఈ విషయం నా తల్లిదండ్రులకు చెబితే వారు అంగీకరించలేదు. అయినా పట్టుదలతో అడుగుపెట్టాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఫొటోగ్రఫీ డైరెక్టర్, పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అంటే ఏంటో తెలియదు. అప్పటికి నేను నటనలో కనీసం ఓనమాలు కూడా నేర్చుకోలేదు. విభిన్నంగా ప్రయత్నించాలనుకున్నా.
తోటి నటీనటులతో కలిసి ప్రతీ సన్నివేశాన్ని చర్చించేదాన్ని. ఇక్కడికి వచ్చి సరైన నిర్ణయం తీసుకున్నానా అని ఎన్నోసార్లు ఆలోచించాను. 'లైలా మజ్ను’ సమయంలో సెట్స్‌లో ప్రతిరోజూ ఏడ్చేదాన్ని. వాళ్లు చెప్పే భాష నాకు అర్థమయ్యేది కాదు. ఇంటికెళ్లి పాత్ర డైలాగులు ప్రాక్టీస్ చేసేదాన్ని’ అంటూ కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం త్రిప్తి మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అనీస్ బజ్మీ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విద్యాబాలన్, మాధురీదీక్షిత్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. దీనితో పాటు ’ధడక్ 2’ లోనూ త్రిప్తి కనిపించనున్నారు.
ఇంకా చదవండి: మతాంతర వివాహంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా: నటి ప్రియమణి మనోగతం
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# TriptiDimri # AneesBazmee # Animal