అమెరికాలో యాక్సిడెంట్‌కు గురయ్యా... అందుకే చిత్రాలను తీసుకుని రాలేకపోయా: నవీన్ పోలిశెట్టి
5 months ago | 41 Views
ప్రేక్షకులకు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సారీ చెప్పారు. గత కొంతకాలంగా ఆయన సినిమా ఇండస్ట్రీలో కనిపించడం లేదు. అలాగే ఆయన సినిమాల అప్‌డేట్స్ కూడా ఏవిూ రావడం లేదు. దీంతో ఆయన అభిమానులు ఎక్కడ డిజప్పాయింట్ అవుతారో అని చెప్పి.. అసలు ఏం జరిగిందో ఆయన క్లారిటీ ఇస్తూ ఓ లేఖను విడుదల చేశారు. ఇటీవల ఆయన అమెరికాలో యాక్సిడెంట్‌కి గురైన విషయం తెలిసిందే. ఈ యాక్సిడెంట్‌లో ఆయనకు తీవ్రంగానే గాయపడినట్లుగా ఇప్పుడాయన విడుదల చేసిన లేఖ చూస్తుంటే తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టి ఈ లేఖలో ఏం చెప్పారంటే.. ఈరోజు విూతో నేనొక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ, నాకు చేతి బోన్‌కి తీవ్రమైన మల్లిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, కాలికి కూడా ఇంజురీ అయ్యింది. ఇది నాకు చాలా టప్ అండ్ పెయిన్ ఫుల్ టైమ్. ముఖ్యంగా క్రియేటివ్ యాంగిల్‌లో. ఈ ఇంజురీ వల్ల నేను ఫాస్ట్‌గా విూ ముందుకు నా ఫిలిమ్స్‌ని తీసుకురాలేక పోతున్నందుకు సారీ. గత కొన్ని రోజులు చాలా టప్‌గా గడిచాయి. నేను కంప్లీట్‌గా రికవర్ అయ్యి, విూకు నా బెస్ట్ ఎనర్జిటిక్ వెర్షన్‌ని చూపించడానికి మెడికల్ ప్రొఫెషనల్స్ సహాయంతో వర్క్ చేస్తున్నాను. కానీ దానికి కొన్ని నెలలు టైమ్ పడుతుంది. నేను ముందు కంటే స్ట్రాంగ్ గా, హెల్దీగా కమ్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను. గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు డెవలప్మెంట్‌లో ఉన్న నా అప్‌కమింగ్ ఫిలిమ్ స్క్రిప్ట్స్ అద్భుతంగా, విూకు బాగా నచ్చే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. నేను పూర్తిగా రికవర్ అయ్యాక వాటి షూటింగ్ మొదలుపెడతాను. విూ లవ్ అండ్ ఎంకరేజ్‌మెంటే నాకు అన్నీ. నేను తిరిగి విూ ముందుకు రావాలన్న ఆశకి అవే మోటివేషన్. విూ సపోర్ట్‌కి, షేషన్స్‌కీ చాలా థ్యాంక్స్. అతి త్వరలో నేను మళ్లీ స్క్రీన్ విూద కనిపించి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాను. విూరు ఎప్పటిలాగే నా విూద విూ ప్రేమని కురిపించడానికి సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నాను. లవ్, విూ జానేజిగర్‘ అని నవీన్ పోలిశెట్టి ఈ లేఖలో పేర్కొన్నారు.
ఇంకా చదవండి: దక్షిణాది చిత్రాల ప్రముఖుల భేటీ... అంబానీ ఇంట పెళ్లిల్లో కనిపించిన దృశ్యం
# Naveen Polisheety # America