వీడ్కోలు మిత్రమా..! రతన్ టాటా మాజీ ప్రేయసీ, బాలీవుడ్ నటీ సిమీగరెవాల్
2 months ago | 5 Views
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా మరణం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రతన్ టాటా మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రతన్ టాటా మరణం పట్ల ఆయన మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సిమి గరెవాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 'మీరు ఇక లేరని అంటున్నారు. ఆ లోటు భరించడం చాలా కష్టం.. వీడ్కోలు మిత్రమా’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
బాలీవుడ్ నటి అయిన సిమి గరెవాల్ గతంలో రతన్ టాటాతో ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రతన్ టాటాతో సన్నిహితంగా మెలిగినట్లు తెలిపారు. ఆ తర్వాత విడిపోయామని, అప్పటి నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. రతన్ టాటా ఇప్పటికీ అవివాహితుడు. నాలుగు సార్లు పెళ్లి దాకా వచ్చారు కానీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాలేదు. లాస్ ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు ఒకమ్మాయితో ప్రేమలో పడ్డాను అని టాటా చెప్పారు. 1962 ఇండో..చైనా యుద్ధం కారణంగా ఆమె తల్లిదండ్రులు ఇండియాకు పంపించేందుకు అంగీకరించలేదు. అలా లవ్ మ్యారేజ్‌కు బ్రేక్ పడిందని తెలిపారు.
ఇంకా చదవండి: మళ్లీ తెరపైకి పూర్ణా మార్కెట్!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!