
గోలీమార్ సిక్వేల్ రెడీ అవుతున్న పూరీ
1 month ago | 5 Views
అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ఒక సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆయన గత చిత్రాలైన లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో ఎలాగైన మళ్లీ హిట్టు కొట్టాలనే కసితో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ బయటికి వచ్చింది. పూరీ జగన్నాథ్ గోపిచంద్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం గోలిమార్. ప్రియమణి కథానాయికగా నటించగా.. బెల్లంకొండ సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించాడు.
2010లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా గోపిచంద్ కెరీర్‌లో మరిచిపోలేని చిత్రంగా మిగిలింది. పోలీస్ మాఫీయా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రంలో గంగారాం అనే పోలీస్ పాత్రలో ఆకట్టుకున్నాడు గోపిచంద్. అయితే ఈ సినిమా వచ్చి 15 ఏండ్ల అవుతున్న తర్వాత ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. గోపిచంద్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ సీక్వెల్‌ను కూడా బెల్లంకొండ సురేష్ నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇంకా చదవండి: 'పింక్' సినిమా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా : కీర్తి కుల్హారి
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!