రాజమౌళి స్ఫూర్తితో 'గోట్' సినిమా నిర్మాణం!
3 months ago | 32 Views
'గోట్’ చిత్రంలో దళపతి విజయ్‌ను కొత్తగా చూపించబోతున్నాం. భారీ తారాగణం ఉన్నా ఏడాదిలో చిత్రీకరణ పూర్తి చేశాం. దీనికి స్ఫూర్తి రాజమౌళి గారే. నేను ఆయనకు పెద్ద అభిమానిని. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నాను’ అని దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పారు. ఈ నెల 5న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు ప్రశాంత్ మాట్లాడుతూ .. ''ఇదొక అద్భుతమైన చిత్రం. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇంతమంది స్టార్స్‌తో ఒక సినిమా తీయడం మామూలు విషయం కాదు. వెంకట్ ప్రభు చాలా కష్టపడ్డారు. యువన్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రత్యేకాకర్షణ’ అన్నారు. నిర్మాత అర్చనా కల్పాతి మాట్లాడుతూ ‘ది గోట్’ చిత్రం గొప్ప విజయాన్ని సాధిస్తుదనే నమ్మకం ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్‌తో కలసి పనిచేయడం ఆనందంగా ఉంది. చాలా ఎక్కువ థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. సినిమాను ఎంజాయ్ చేయండి’ అని ప్రేక్షకులను కోరారు. విూనాక్షి చౌదరి మాట్లాడుతూ ... ''నా కెరీర్ ప్రారంభంలోనే ఈ చిత్రంతో చాలా గొప్ప నటీనటులతో పనిచేసే అవకాశం దక్కింది. విజయ్ గారు చాలా కూల్‌గా ఉంటారు. ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి’ అన్నారు. విజయ్, వెంకట్ ప్రభుతో కలసి పనిచేసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది అని లైలా చెప్పారు. చాలా రోజుల తర్వాత నా సినిమా వస్తోంది, మిమ్మల్ని అలరిస్తుంది అని స్నేహ అన్నారు.
ఇంకా చదవండి: అందాల ఆరబోతలో మాళవిక!
# Venkatprabhu # Prashant # Vijaythalapathy