గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ తెర‌కెక్కించిన ‘గేమ్ చేంజ‌ర్’ సినిమా యూనివ‌ర్స‌ల్‌గా అంద‌రినీ అల‌రిస్తుంది - నిర్మాత దిల్ రాజు

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ తెర‌కెక్కించిన ‘గేమ్ చేంజ‌ర్’ సినిమా యూనివ‌ర్స‌ల్‌గా అంద‌రినీ అల‌రిస్తుంది - నిర్మాత దిల్ రాజు

1 month ago | 5 Views

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 10, 2025న  మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. న‌వంబ‌ర్ 9న ల‌క్నోలో ఈ మూవీ టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తున్నారు. గేమ్ చేంజ‌ర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్య‌రామ్ మూవీస్ సంస్థ‌లు త‌మిళంలో విడుద‌ల చేస్తున్నాయి. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో నిర్మాత‌లు దిల్‌రాజు, ఆదిత్య రామ్‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘నా 21 ఏళ్ల ప్ర‌యాణంలో నిర్మాత‌గా ‘గేమ్ చేంజ‌ర్‌’ నా 50వ సినిమా. సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. మూడేళ్ల క్రితం శంక‌ర్‌గారు ఈ సినిమా స్టోరీ లైన్ నాకు చెప్ప‌గానే ఎగ్జ‌యిట్ అయ్యాను. ఆదిత్య‌రామ్‌గారు నాకు మంచి స్నేహితుడు. ఆయ‌న ఇది వ‌ర‌కే తెలుగు సినిమాల‌ను కూడా నిర్మించారు. త‌ర్వాత ఆయ‌న చెన్నైలో రియ‌ల్ ఎస్టేట్ చేస్తూ బిజీగా ఉండిపోయారు. ఇటీవ‌ల ఆయ‌న్ని క‌లిసిన‌ప్పుడు నేను గేమ్ చేంజ‌ర్ మూవీని చేస్తున్నాన‌ని చెప్పగా, ఆదిత్య రామ్ కూడా ఇన్‌స్పైర్ అయ్యి ఇద్ద‌రం క‌లిసి చేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాం. ఈ ట్రావెల్ కంటిన్యూ అవుతుంది. ఈ సినిమాతో పాటు, మ‌రికొన్ని తమిళ సినిమాల‌ను, పాన్ ఇండియా సినిమాల‌ను కూడా మేం నిర్మించ‌టానికి ప్లాన్ చేస్తున్నాం. వారిసు సినిమా త‌ర్వాత నేను త‌మిళంలో ఇంకా సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. న‌వంబ‌ర్ 9న గేమ్ చేంజ‌ర్ టీజ‌ర్‌ను ల‌క్నోలో విడుద‌ల చేయ‌బోతున్నాం. త‌ర్వాత యు.ఎస్‌లో ఓ భారీ ఈవెంట్ చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాం. త‌ర్వాత చెన్నైలో ఓ ఈవెంట్ చేస్తున్నాం. జ‌న‌వ‌రి తొలి వారంలో ఏపీ, తెలంగాణ‌ల్లో ఈవెంట్స్ నిర్వ‌హిస్తాం. జ‌న‌వ‌రి 10న సంక్రాంతి స్పెష‌ల్‌గా గేమ్ చేంజ‌ర్ సినిమాను రిలీజ్ చేస్తాం. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నాం. యూనివ‌ర్స‌ల్‌గా గేమ్ చేంజ‌ర్ సినిమా అంద‌రినీ మెప్పిస్తుంది. శంక‌ర్ గారి సినిమాలంటేనే స్పెష‌ల్‌గా ఉంటాయి. సాంగ్స్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా సినిమాలో ఉంటుంది.. అవ‌న్నీ గేమ్ చేంజ‌ర్ మూవీలో ఉంటాయి. ట్రిపులార్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌గారు గ్లోబ‌ల్ స్టార్ అయ్యారు. ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న సినిమా గేమ్ చేంజ‌ర్‌. కియారా అద్వానీ హీరోయిన్‌. ఎస్‌.జె.సూర్య‌గారు కీ రోల్ చేశారు. త‌మ‌న్ ఫెంటాస్టిక్ సాంగ్స్ అందించారు’’ అన్నారు.

ఆదిత్య రామ్ మాట్లాడుతూ ‘‘నేను సినీ రంగం నుంచి గ్యాప్ తీసుకుని 10 సంవత్సరాలకు పైగానే అయ్యింది. దిల్‌రాజుగారితో క‌లిసి ఈ రోజు మీ ముందుకు వ‌చ్చాను. నేను ఆదిత్య‌రామ్ మూవీస్ బ్యాన‌ర్‌పై నాలుగు సినిమాలు చేశాను. ప్ర‌భాస్‌గారితో ఏక్ నిరంజ‌న్ సినిమా నిర్మించిన త‌ర్వాత బ్రేక్ తీసుకున్నాను. రియ‌ల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టేశాను. అందువ‌ల్ల బ్రేక్ వ‌చ్చింది. ఇప్పుడు గేమ్ చేంజ‌ర్ సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాను. ఎస్‌వీసీతో క‌లిసి ఆదిత్య‌రామ్ మూవీస్ ఈ సినిమాను తమిళంలో విడుద‌ల చేస్తుంది. అలాగే మా కాంబినేష‌న్‌లో త‌మిళంతో పాటు పాన్ ఇండియా సినిమాల‌ను కూడా నిర్మించ‌టానికి ప్లాన్ చేస్తున్నాం. మంచి క‌థ‌లు, డైరెక్ట‌ర్స్ తో మంచి సినిమాలు చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాం. దిల్‌రాజుగారి విష‌యానికి వ‌స్తే మంచి క‌థ‌ను సెల‌క్ట్ చేసుకుని, స్క్రిప్ట్‌ను గొప్ప‌గా సిద్ధం చేసి, కొత్త ద‌ర్శ‌కుడిని ఎంచుకుని సినిమా చేస్తారు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఎక్కువ సంఖ్య‌లో బ్లాక్ బ‌స్ట‌ర్స్‌, హిట్ సినిమాలు చేసిన నిర్మాత దిల్‌రాజుగారు. ఆయ‌న‌తో క‌లిసి స‌క్సెస్‌ఫుల్ సినిమాల‌ను నిర్మిస్తాన‌ని న‌మ్మ‌కంగా ఉన్నాను’’ అన్నారు.

ఇంకా చదవండి: "ఆదిపర్వం" ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది - దర్శకుడు సంజీవ్ మేగోటి

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# గేమ్ చేంజ‌ర్     # దిల్ రాజు     # రామ్ చ‌ర‌ణ్    

trending

View More