'దసరా'కు గేమ్ ఛేంజర్ టీజర్.. సంగీత దర్శకుడు థమన్ వెల్లడి!
2 months ago | 5 Views
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. 'గేమ్ ఛేంజర్ టీజర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు సాలిడ్ అప్‌డేట్ ఇచ్చాడు థమన్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగానే ఇప్పటికే విడుదల చేసిన.. జరగండి జరగండి, రా మచ్చా, మచ్చా సాంగ్‌లు ఆన్‌లైన్‌లో దూసుకుపోతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని అభిమానులు థమన్‌ను అడిగారు. దీనికి సమాధానంగా దసరా కానుకగా రాబోతుందంటూ ప్రకటించాడు. దీంతో అక్టోబర్ 12న ఈ సినిమా టీజర్ రాబోతున్నట్లు తెలుస్తుంది. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, ఎస్.జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇంకా చదవండి: స్టార్ నటి అనుష్క పెళ్లి కుదిరిందా..
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!