మళ్లీ తెరపైకి పూర్ణా మార్కెట్!
2 months ago | 5 Views
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'శివమణి' సినిమాలో వచ్చే పూర్ణా మార్కెట్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే చాలా రోజుల తర్వాత పూర్ణా మార్కెట్‌ను సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి చూడబోతున్నారు టాలీవుడ్ సినీ జనాలు. ఇంతకీ ఎలా అనే కదా మీ డౌటు. వరుణ్ తేజ్ నటిస్తోన్న 'మట్కా' సినిమా కోసం వింటేజ్ వైజాగ్ బ్యాక్ డ్రాప్‌లో పూర్ణా మార్కెట్ (ప్రస్తుతం లేదు)తో పాటు పలు ప్రాంతాలను రీక్రియేట్ చేశారు. పూర్ణా మార్కెట్.. మట్కా.. బిహైండ్ ది గేమ్.. యాక్ట్ 1 అంటూ మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
పూర్ణా మార్కెట్ సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నట్టు విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. 'మట్కా' కోసం మేకర్స్ ఇప్పటికే 1980 బ్యాక్‌డ్రాప్ వైజాగ్ లొకేషన్స్ రీక్రియేషన్‌కు సంబంధించి లాంచ్ చేసిన స్పెషల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'పలాస 1978' ఫేం కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ.. వరుణ్ తేజ్ సూట్‌లో సూపర్ స్టైలిష్‌గా సిగరెట్ తాగుతూ.. మెట్లు దిగుతున్న పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
ఇంకా చదవండి: స్మోకింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన విష్ణుప్రియ!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!