రెహమాన్‌కు ఇచ్చిన మాట కోసం...
1 month ago | 5 Views
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు. సోమవారం కడపలో జరగనున్న 80వ జాతీయ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు అతిథిగా హాజరు కావాలంటూ ఆయనకు ఆహ్వానం అందింది. సంబంధిత నిర్వాహకులు రామ్‌చరణ్‌ను కలిసి ఆహ్వానించారు. గత ఏడాది ఇదే ఈవెంట్‌కు సంగీత దర్శకుడు ఎ.ఆర్ రెహమాన్ హాజరయ్యారు. ఆయన సూచనతో నిర్వాహకులు రామ్‌చరణ్‌ను అతిథిగా ఆహ్వానించారు. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పటికీ రెహమాన్ సూచించడంతో చరణ్ సోమవారం రాత్రి 8 గంటలకు జరగబోయే ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు.
దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ వినూత్నంగా ప్లాన్ చేశారు. ఇటీవల లక్నోలో ఓ ఈవెంట్ నిర్వహించారు. తదుపరి వరుసగా దేశంలోని ముఖ్య నగరాల్లో ఈవెంట్స్ చేయబోతున్నారు. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని, అంజలి, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇంకా చదవండి: ఆ సీక్వేల్‌కు నేను సూట్ కాదనిపించింది : నయనతార