ఎట్టకేలకు జానీ మాస్టర్‌కు బెయిల్.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు!
26 days ago | 5 Views
మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తనని లైంగికంగా వేధించారన్న మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రెండు వారాలుగా ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును నిలిపివేస్తున్నట్లు అవార్డుల కమిటీ ప్రకటించింది. ఈ అవార్డు ఫంక్షన్ కోసం జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కూడా పొందారు. తాజాగా మరోసారి తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2017లో జానీ మాస్టర్ పరిచయ మయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకొచ్చేశాను. అయినా సొంతంగా పని చేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రానీయకుండా ఇబ్బంది పెట్టాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు.
ఇంకా చదవండి: చిరంజీవి డ్యాన్స్‌లో గ్రేస్ చూసి టెన్షన్ పడ్డా: తొలినాటి అనుభవాలను పంచుకున్న నాగార్జున