నాగచైతన్య పదిహేనేళ్ల ప్రయాణం!
3 months ago | 49 Views
సినీ పరిశ్రమలో వారసుల రాక కొత్తేవిూ కాదు. విజయం సాధించి, నిలిచిన వారు కొందరైతే.. సక్సెస్ అందుకునే ప్రయత్నంలో ఉన్నవాళ్లు మరికొందరు. ఈ క్రమంలో సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న స్టార్ కిడ్స్‌లో ఒకడు నాగచైతన్య. అక్కినేని నాగేశ్వర్రావు ఫ్యామిలీ నుండి నాగార్జున కొడుకుగా.. ఏఎన్‌ఆర్ మనవడిగా 'జోష్' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చైతూ విజయవంతంగా పదిహేనేండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు.
వాసు వర్మ డైరెక్షన్‌లో చైతూ నటించిన జోష్ 2009 సెప్టెంబర్ 5 వచ్చి, నేటితో 15 ఏండ్లు పూర్తి చేసుకుంది. కథ, దర్శకులపై నమ్మకముంచి.. సినిమా సినిమాకు నటుడిగా తనను తాను నిరూపించుకున్న చైతూకు తండేల్ మేకర్స్, ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు, కోస్టార్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగచైతన్య ప్రస్తుతం చందూమొండేటి డైరెక్ట్ చేస్తున్న తండేల్‌లో నటిస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు తెరకెక్కిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ తండేల్ నుంచి షేర్ చేసిన ఫస్ట్ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా ఊర మాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
ఇంకా చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !