సల్మాన్ కి వచ్చిన బెదిరింపులపై స్పందించిన మాజీ ప్రేయసి సోమీ అలీ
1 month ago | 5 Views
అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంని ఉద్దేశించి బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీమాట్లాడారు. అండర్‌వరల్డ్ నుంచి సల్మాన్‌కు గతంలో బెదిరింపులు వచ్చాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ‘‘నేను బాలీవుడ్‌లో వర్క్ చేసిన సమయంలో దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ గురించి చాలామంది నటీనటులు మాట్లాడుకోవడం విన్నాను. వీరిలో ఎవరూ ప్రత్యక్షంగా మాట్లాడుకునేవారు కాదు. ‘అండర్ వరల్డ్’ అని కోడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకునేవారు. సల్మాన్‌తో కలిసి గ్యాలెక్సీ నివాసంలో ఉన్న సమయంలో ఆయనకు ఓసారి అండర్‌వరల్డ్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. ఫోన్ ఎవరు చేశారో తెలియదు కానీ.. అతడు మాత్రం బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘సల్మాన్‌కు చెప్పు.. ఆయన ప్రియురాలిని మేము కిడ్నాప్ చేయనున్నామని’’ అన్నారు.
అతడి మాటలతో నాకెంతో భయం కలిగింది. వెంటనే ఆ విషయాన్ని సల్మాన్‌కు చెప్పాను. ఆయన కూడా కంగారుపడ్డారు. పరిస్థితులు చక్కబడేలా చేశారు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుందామని ఎన్నోసార్లు ప్రయత్నించా. సల్మాన్‌నూ అడిగా. ‘ఈ విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది’ అని ఆయన చెప్పారు’’ అని సోమీ అలీ తెలిపారు. సోమీ అలీ బాలీవుడ్‌లో ‘ఆందోళన్’, ‘మాఫియా’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. సల్మాన్‌ఖాన్ - సోమీ అలీ ప్రధాన పాత్రల్లో గతంలో ఓ చిత్రాన్ని ప్రకటించారు. చిత్రీకరణ దశలో ఉండగానే ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సోమీ - సల్మాన్ ప్రేమలో పడినట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై ఓ సందర్భంలో సోమీ స్పందిస్తూ ‘సల్మాన్ అంటే నాకెంతో ఇష్టం. సల్మాన్‌కు నా ప్రేమను తెలియజేశా’ అని చెప్పారు. కారణాలు తెలీదు కానీ వీరిద్దరూ కొన్నాళ్లకు దూరమయ్యారు.
ఇంకా చదవండి: నేను బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్య రాయ్ కొడుకును....
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# సల్మాన్‌ఖాన్ # సోమీఅలీ # బాలీవుడ్