ఇక్కడ ప్రతిదీ కష్టమే : కృతిసనన్‌!

ఇక్కడ ప్రతిదీ కష్టమే : కృతిసనన్‌!

1 month ago | 5 Views

ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చితనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకుంది కృతిసనన్‌. తెలుగులో మహేశ్‌ బాబుతో వన్‌ నేనొక్కడినే, నాగచైతన్యతో దోచెయ్‌ సినిమాల్లో మెరిసిన ఈ భామ ప్రస్తుతం హిందీపైనే ఫోకస్‌ పెట్టిందని తెలిసిందే. ఈ బ్యూటీ 2024 ఈవెంట్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో నెపోటిజమ్‌ (బంధు ప్రీతి)తోపాటు తన డ్రీమ్‌ రోల్‌ ఏంటో చెప్పుకొచ్చింది. డ్రీమ్‌ రోల్‌ గురించి మాట్లాడుతూ.. నాకు సూపర్‌ ఉమెన్‌ పాత్ర చేయాలని ఉంది. పూర్తిగా నెగెటివ్‌ పాత్రలో నన్ను నేను ఆవిష్కరించుకోవాలనుకుంటున్నానని చెప్పింది.  నెపోటిజమ్‌కు ఇండస్ట్రీ పెద్దగా బాధ్యత వహించదని నేను భావిస్తున్నా. కానీ ఈ విషయంలో మీడియా, ప్రేక్షకులు చాలా కీలక పాత్ర పోషిస్తారు.

Kriti Sanon: Kriti Sanon: Will check out belly-dancing next year

కొందరు స్టార్‌ కిడ్స్‌ పట్ల మాత్రం మీడియా ఎలా వ్యవహరిస్తుందో ప్రేక్షకులు చూడాలనుకుంటారు. ప్రేక్షకులు ఆ స్టార్‌ కిడ్స్‌ పట్ల ఆసక్తి చూపించడం వల్ల వారితో సినిమా చేయాలని ఇండస్ట్రీ భావిస్తుంది. ఇది ఒక సర్కిల్‌ అని నేననుకుంటున్నానంది. మీరు ప్రతిభావంతులైతే ఇండస్ట్రీకి చేరుకుంటారు. ప్రతిభావంతులు కాకపోతే, ప్రేక్షకులతో కనెక్ట్‌ అవ్వలేకపోతే, అక్కడికి చేరుకోలేరు. నేను వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీ నాకు సాదర స్వాగతం పలికింది. మీరు సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ నుంచి రానప్పుడు.. మీరు కోరుకున్నది అందుకునేందుకు సమయం పడుతుంది. మ్యాగజైన్‌ కవర్‌లో చోటు సంపాదించుకోవడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి ప్రతిదీ కొంచెం కష్టంతోనే కూడుకుని ఉంటుందని చెప్పుకొచ్చింది.

ఇంకా చదవండి: నన్ను సెకండ్ హ్యాండ్ అనడం బాధ కలిగిస్తుంది: సమంత

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# కృతిసనన్‌     # వన్‌నేనొక్కడినే     # దోచెయ్‌    

trending

View More