క్యారెక్టర్ ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ "దిల్ రూబా" నచ్చుతుంది : టీజర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం
3 days ago | 5 Views
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. "దిల్ రూబా" సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...
కో ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ - "దిల్ రూబా" టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ మా టీజర్ ను బాగా ఇష్టపడతారు. లవ్ , యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రమిది. అల్లు అర్జున్ కు ఆర్య మూవీలా కిరణ్ అబ్బవరంకు "దిల్ రూబా" అవుతుంది. క మూవీ తర్వాత కిరణ్ ఈ చిత్రంతో మరో ఫ్రెష్ అటెంప్ట్ చేశారు. మా శివమ్ సెల్యూలాయిడ్ లో వస్తున్న ప్రొడక్షన్ నెం.2 చిత్రమిది. సారెగమా వారితో కలిసి నిర్మిస్తుండటం సంతోషంగా ఉంది. టీజర్ లో సామ్ సీఎస్ మ్యూజిక్ చూశారు కదా, సినిమాలో ఇంకా ఎంజాయ్ చేస్తారు. అలాగే మా డైరెక్టర్ విశ్వకరుణ్ ప్రతిభావంతంగా మూవీ రూపొందించారు. "దిల్ రూబా" సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నాం. మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ మాట్లాడుతూ - "దిల్ రూబా" టీజర్ ను మీరు ఎంత ఎంజాయ్ చేశారో సినిమా అంతకంటే ఎన్నో రెట్లు బాగుంటుంది. లవ్ మంత్ ఫిబ్రవరిలో మా మూవీ మీ ముందుకు వస్తోంది. పక్కా లవ్ స్టోరీ "దిల్ రూబా"ను మీరంతా థియేటర్ లో చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ మాట్లాడుతూ - "దిల్ రూబా" సినిమాకు మా టీమ్ ఎంతో ప్యాషన్, హార్డ్ వర్క్ తో పనిచేశారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. క సినిమా కన్నా "దిల్ రూబా" పెద్ద హిట్ కావాలి. సినిమా చాలా బాగా వచ్చింది. సామ్ సీఎస్ గారు ఇచ్చిన సాంగ్స్ ఆకట్టుకుంటాయి. మా డైరెక్టర్ కరుణ్ దగ్గర ఎన్నో కొత్త కథలు ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాం. అన్నారు.
సినిమాటోగ్రాఫర్ డానియేల్ విశ్వాస్ మాట్లాడుతూ - డైరెక్టర్ కరుణ్ గారు "దిల్ రూబా" కథ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇప్పుడు టీజర్ చూస్తుంటే కథ ఎంత బాగా చెప్పారో అంత బాగా రూపొందించారు అనిపిస్తోంది. కిరణ్ గారి క్యారెక్టరైజేషన్ ఫ్రెష్ గా , ఇంటెన్స్ గా ఉంటుంది. ఆయన లుక్స్ ఎంత బాగున్నాయో టీజర్ లో చూశారు. "దిల్ రూబా" మూవీకి మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ రవి మాట్లాడుతూ - మా శివమ్ సెల్యులాయిడ్ సంస్థలో గతంలో ఓ మూవీ చేశాం. నేను డిస్ట్రిబ్యూషన్ లో చాలా కాలంగా ఉన్నాను. కిరణ్ నా దగ్గరకు ఈ కథ తీసుకొచ్చారు. విశ్వ కరుణ్ డైరెక్టర్ అని చెప్పి పరిచయం చేశారు. కథ చెప్పినప్పుడే ఇది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం కలిగింది. చేస్తే ఇలాంటి మూవీని ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం. "దిల్ రూబా" టీజర్ లో మీరు చూసింది కొంతే. నెక్స్ట్ ట్రైలర్ వస్తుంది. ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ చేస్తాం. కిరణ్ అబ్బవరంను ఇప్పటివరకు చూడని విధంగా ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ లో మీరు చూస్తారు. సినిమాను అహర్నిశలు కష్టపడి రూపొందించారు డైరెక్టర్ విశ్వకరుణ్. "దిల్ రూబా" పెద్ద స్పాన్ ఉన్న మూవీ. ఈ సినిమాకు బిగ్ రిలీజ్ ఇవ్వాలంటే ఓ పెద్ద సంస్థతో కలిసి పనిచేయాలని సారెగమాతో పార్టనర్ అయ్యాం. మా టీమ్ లోని ప్రతి ఒక్కరు డీవోపీ విశ్వాస్, ఎడిటర్ ప్రవీణ్, మ్యూజిక్ సామ్ గారు..ఇలా అంతా చాలా ప్యాషనేట్ గా పనిచేశారు. అన్నారు.
డైరెక్టర్ విశ్వకరుణ్ మాట్లాడుతూ - "దిల్ రూబా" కథను కిరణ్ గారికి అరగంట పాటు చెప్పాను. ఆయనకు కథ విన్న వెంటనే నచ్చి స్క్రిప్ట్ రెడీ చేసుకో అని పంపారు. అక్కడి నుంచి ఈరోజు ఈ వేదిక మీద మాట్లాడేవరకు ప్రతి విషయంలో కిరణ్ గారు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ప్రొడ్యూసర్ ను ఆయనే ఇచ్చారు. ప్రొడ్యూసర్ రవి గారితో నేను 3 ఏళ్లుగా జర్నీ చేస్తున్నా. అలాగే సారెగమా వారి నుంచి మంచి సపోర్ట్ దక్కింది. మా డీవోపీ విశ్వాస్ కు చాలా ఇష్టమైన మూవీ ఇది. ఎంతో కష్టపడి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ సుధీర్, మ్యూజిక్ చేసిన సామ్ గారు, కొరియోగ్రాఫర్స్ ఈశ్వర్, జిత్తు.. ఇతర టీమ్ తమ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. మనందరి జీవితాల్లోని ప్రేమను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీ చేశా. "దిల్ రూబా" సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మీరంతా ఈ లవ్ స్టోరీని థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
కొరియోగ్రాఫర్ ఈశ్వర్ మాట్లాడుతూ - "దిల్ రూబా" సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన మా హీరో కిరణ్ గారికి, ప్రొడ్యూసర్ రవి గారు, డైరెక్టర్ కరుణ్ కు థ్యాంక్స్. ఫ్రెష్ లవ్ స్టోరీతో ఈ మూవీ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరిలో థియేటర్స్ లోకి వస్తున్నాం. మీరంతా మూవీ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
కొరియోగ్రాఫర్ జిత్తు మాట్లాడుతూ - "దిల్ రూబా" సినిమాలో కిరణ్ గారు అర్బన్ లుక్ లో కొత్తగా కనిపిస్తారు. ఆయన క మూవీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉంటే, ఈ మూవీ దానికి భిన్నమైన నేపథ్యంతో ఉంటుంది. మంచి ప్రేమ కథా చిత్రమిది. మా డైరెక్టర్ కరుణ్ గారిలో పూరి జగన్నాథ్ గారు కనిపిస్తున్నారు. "దిల్ రూబా" సినిమాలో మంచి సాంగ్స్ చేశాం. నేను చేసిన రెండు సాంగ్స్ అద్భుతంగా వచ్చాయి. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - "దిల్ రూబా" గురించి మాట్లాడేముందు ఫస్ట్ మా ప్రొడక్షన్ హౌస్ సారెగమా వారికి థ్యాంక్స్ చెప్పాలి. తెలుగులో వారి ఫస్ట్ మూవీలో నేను హీరో కావడం సంతోషంగా ఉంది. నన్ను, మా టీమ్ ను వారు ఎంతో బాగా చూసుకున్నారు. అలాగే సారెగమా సంస్థ ప్రొఫెషనలిజం నాకు బాగా నచ్చింది. మా ప్రొడ్యూసర్ రవి చాలాకాలంగా డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారు. నాకు రవి, సురేష్ రెడ్డి 2019లో పరిచయం. నా రాజావారు రాణిగారు సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తారా అని అడిగేందుకు వెళ్లాను. సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి రవి అన్న. ఈ కథ నచ్చి ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమా కోసమే కష్టపడుతున్నారు. సినిమాను ఎంత బెటర్ మెంట్ చేయొచ్చు, ఇంకా ఎంతగా ఆడియెన్స్ దగ్గరకు రీచ్ చేయొచ్చు అనేది ప్రతి రోజు ఆలోచిస్తూ వర్క్ చేస్తుంటారు. తనొక ప్రొడ్యూసర్ అయినా సినిమా కోసం ప్రతి ఒక్కరినీ రిక్వెస్ట్ చేస్తుంటారు. డైరెక్టర్ కరుణ్ నాకు మూడేళ్లుగా తెలుసు. ఒకరోజు వచ్చి కథ చెప్పాడు. అతను కథ చెప్పే విధానం చాలా కొత్తగా అనిపించింది. ఏ సందర్భాన్నైనా ఆకట్టుకునేలా చెప్పగలడు. "దిల్ రూబా" సినిమాలో నేను చేసిన సిద్ధు, సిద్ధార్థ్ క్యారెక్టర్ చాలా స్పెషల్ గా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రేమతో సహా ఏ విషయంలోనైనా వెనక అడుగు వేయడు. తన నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడి ఉంటాడు. అలాంటి సిద్ధార్థ్ లు మీలోనూ ఉంటారు. వారందరికీ "దిల్ రూబా" బాగా నచ్చుతుంది. నా టీమ్ లో డీవోపీ విశ్వాస్ ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ సినిమా కోసం ఎంతైనా కష్టపడతాడు. "దిల్ రూబా" నా కెరీర్ లో బెస్ట్ ఆల్బమ్. సామ్ సీఎస్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ ప్రవీణ్ గారు సినిమాను బ్యూటిఫుల్ గా ఎడిట్ చేశారు. ఫిబ్రవరిలో "దిల్ రూబా" సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. సినిమాను ప్రేమించే మా ప్రొడ్యూసర్ రవి, మా డైరెక్టర్ కరుణ్ కోసమైనా పెద్ద హిట్ కావాలి. "దిల్ రూబా"లో సిద్ధు డైలాగ్ చెప్తాడు స్ట్రాంగ్ మ్యాన్ డోంట్ హ్యావ్ ఆటిట్యూడ్, దే హావ్ క్యారెక్టర్. క్యారెక్టర్ ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ మా "దిల్ రూబా" సినిమా నచ్చుతుంది. హీరో నమ్మే సిద్ధాంతం చాలా కొత్తగా ఉంటుంది. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. అదేంటి అనేది ట్రైలర్ లో చూపిస్తాం. పక్కా ఎంటర్ టైన్ మెంట్, ఇంటెన్స్ లవ్ స్టోరీతో "దిల్ రూబా" ఆకట్టుకుంటుంది. క సినిమా తర్వాత నా మూవీస్ మీద ఆడియెన్స్ పెట్టుకున్న అంచనాలను "దిల్ రూబా" తప్పకుండా అందుకుంటుంది. నేను ఒక యంగ్ హీరోగా వీలైనన్ని ఎక్కువ మూవీస్ చేయాలనుకుంటున్నా. అప్పుడే చాలామంది కొత్త టెక్నీషియన్స్ కు అవకాశం కల్పించగలుగుతాను. ప్రస్తుతం నాలుగు మూవీస్ చేస్తున్నాను. ఏడాదికి కనీసం 3 సినిమాలు రిలీజ్ కు తీసుకురావాలనేది నా కోరిక. అది ఎంతవరకు వీలవుతుందో ప్రయత్నిస్తాను. అన్నారు.
నటీనటులు - కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, తదితరులు
టెక్నికల్ టీమ్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్) & దుడ్డి శ్రీను.
ప్రొడక్షన్ డిజైనర్ - సుధీర్
ఎడిటర్ - ప్రవీణ్.కేఎల్
సినిమాటోగ్రఫీ - డానియేల్ విశ్వాస్
మ్యూజిక్ - సామ్ సీఎస్
నిర్మాతలు - రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి,సారెగమ.
రచన, దర్శకత్వం - విశ్వ కరుణ్
ఇంకా చదవండి: కొత్త పాయింట్‌తో రాబోతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది.. ‘బార్బరిక్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో స్టార్ దర్శకుడు మారుతి
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# దిల్ రూబా # కిరణ్ అబ్బవరం # రుక్సర్ థిల్లాన్