
అందరూ దయతో ఉండండి : రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
1 month ago | 5 Views
ఎప్పుడూ సోషల్ విూడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన సినిమా విశేషాలు పంచుకునే ఆమె తాజాగా దయగా ఉండండి అంటూ పోస్ట్ పెట్టారు. ‘ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతోంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. విూరంతా కూడా అలానే ఉండండి. ఒకరిపై ఒకరు దయతో ఉండండి‘ అని రాసుకొచ్చారు. తాను ధరించిన టీ షర్ట్ విూద కూడా దయ అనే రాసి ఉంది. దీంతో ఈ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ జిమ్‌లో కలిసి కనిపించిన వీడియో వైరలైన విషయం తెలిసిందే. అయితే, జిమ్‌లో నుంచి బయటకు వచ్చిన విజయ్ కారులో కూర్చోగా.. రష్మిక కాలికి ఉన్న గాయం కారణంగా ఇబ్బందిపడుతూ కారు ఎక్కారు. ఈ వీడియోపై కొందరు విజయ్‌ను విమర్శిస్తున్నారు.
రష్మికకు సాయం చేయొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక పోస్ట్ వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రష్మిక నటించిన ఛావా విడుదలకు సిద్ధమైంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితాధారంగా రూపొందుతున్న చిత్రమే ’ఛావా’. శంభాజీ మహరాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య పాత్రలో రష్మిక నటించారు. ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. దీనితో పాటు సల్మాన్ ఖాన్ సరసన ’సికందర్’లో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఇది రానుంది. అలాగే వీటితో పాటు ’థామ’, ’కుబేర’, ’ది గర్ల్‌ఫ్రెండ్’, ’రెయిన్ బో’ చిత్రాలతోనూ రష్మిక బిజీగా ఉన్నారు.
ఇంకా చదవండి: పెళ్లి చేసుకోకండి : థమన్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!