'పుష్పా-2' ఆలస్యం అయినా ..అంచనాలు మించుతుంది.. నటుడు అల్లు శిరీష్ ఆసక్తికర కామెంట్స్!
4 months ago | 58 Views
'పుష్పా2' ఆసల్యం అయినా ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకుంటుందని అల్లు శిరీష్ కామెంట్ చేశారు. తన సోదరుడు, నటుడు అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ’పుష్ప 2’ పై నటుడు అల్లు శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’పుష్ప 2’ విడుదల ఆలస్యం కానుందంటూ జరుగుతోన్న ప్రచారంపై ’బడ్డీ’ ప్రమోషన్స్‌లో స్పందించారు. సినిమా ఎప్పుడు వచ్చినా అభిమానుల అంచనాలను తప్పకుండా అందుకుంటుందన్నారు. ‘పుష్ప 2’పై విూ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించండి. డిసెంబర్ 6వ తేదీ లేదా ఎప్పుడు వచ్చినా ఆ సినిమా తప్పకుండా విూ అంచనాలు అందుకుంటుంది. ఇది మా అన్నయ్య సినిమా అని నేను ఈ విషయాన్ని చెప్పడం లేదు. సుకుమార్ చాలా అద్భుతంగా దీనిని చెక్కుతున్నారని ఫిల్మ్‌నగర్‌లో మాట్లాడుకుంటుంటే అది నావరకూ వచ్చింది. దానినే విూతో పంచుకుంటున్నా‘ అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా మూవీ ’పుష్ప ది రైజ్’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఇది తెరకెక్కింది. సుకుమార్ దర్శకుడు.
రష్మిక కథానాయిక. దీనికి కొనసాగింపుగా ’పుష్ప ది రూల్’ సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. తొలుత దీనిని ఆగస్టు 15న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించినప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ ఆరో తేదీకి వాయిదా వేశారు. మరోవైపు, ’ఊర్వశివో రాక్షసివో’ తర్వాత అల్లు శిరీష్ నటించిన చిత్రం ’బడ్డీ’. స్టూడియో గ్రీన్ పతాకంపై తెరకెక్కింది. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించగా.. కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఆగస్టు 2న విడుదల కానుంది. తెలుగు రాష్టాల్లోన్రి పలు నగరాల్లో ఇప్పటికే ప్రీమియర్స్ వేయగా మంచి టాక్ లభించింది.
ఇంకా చదవండి: 'మార్ ముంతా ఛోడ్ చింతా’ మాస్ డ్యూయెట్.. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదు: మణిశర్మ
# Pushpa2 # AlluArjun # FahadhFaasil # RashmikaMandanna