15 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ.. మొదటి సినిమానే ఓ సెస్సెషన్!!
2 months ago | 5 Views
సినీరంగుల ప్రపంచంలోకి బాలనటిగా అడుగుపెట్టి ఆ తర్వాత టాప్ హీరోయిన్ గా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. హిందీలో అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కథానాయికగా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇంకేముంది తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ మంచి పాపులారిటిని సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ హీరోయిన్ చాలా స్పెషల్.. చైల్డ్ ఆర్టిస్టుగా తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత కథానాయికగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాలేదు. దీంతో తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. 15 ఏళ్లకే చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా మెరిసిన ఆ తార ఎవరో తెలుసా.. తనే హన్సిక మోత్వాని. అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.
ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఒక్కసారిగా హన్సిక పేరు మారుమోగింది. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. స్టార్ స్టేటస్ రాకపోయినా జనం గుండెల్లో స్థానం సంపాదించుకుంది హన్సిక. ఆమె నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. టాలీవుడ్, కోలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ పలు హిట్ చిత్రాల్లో నటించింది. కానీ కొన్నాళ్లుగా ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ రాలేదు. దీంతో కేవలం ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. కెరీర్ మధ్యలోనే తన స్నేహితుడి సోహైల్ ఖతురియాను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న హన్సిక..సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను, అభిమానులతో పంచుకుంటుంది. మె షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత హన్సిక తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని మరింత అందంగా మారింది. గతంలో హన్సిక గురించి అనేక విమర్శలు వచ్చాయి. హన్సిక హార్మోజ్ ఇంజక్షన్ వేసుకుందని జోరుగా వార్తలు వచ్చాయి. కానీ వాటిపై క్లారిటీ ఇచ్చింది. నాపై వచ్చిన ఆరోపణలు నన్ను చాలా బాధించాయని హన్సిక తెలిపింది.
ఇంకా చదవండి: జానీ మాస్టర్ పోస్టు వైరల్.. అందరికీ థ్యాంక్స్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# హన్సిక # అల్లు అర్జున్