'కలర్‌ఫొటో' దర్శకిడి నిశ్చితార్థం
1 month ago | 5 Views
'కలర్‌ఫొటో 'సినిమాతో డైరెక్టర్‌గా మంచి ఫేం సంపాదించాడు సందీప్ రాజ్. డైరెక్టర్‌గా, రైటర్‌గా కెరీర్ కొనసాగిస్తున్న సందీప్ రాజ్ త్వరలోనే పెండ్లి పీటలెక్కబోతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన వార్త బయటకు వచ్చింది. ఇటీవల సందీప్ రాజ్- నటి, క్లాసికల్ డ్యాన్సర్ చాందిని రావు నిశ్చితార్థం పూర్తయింది. వైజాగ్‌లో కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో సందీప్ రాజ్-చాందిని రావు నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా యంగ్ కపుల్‌కు ఇండస్ట్రీ ప్రముఖులు, మూవీ లవర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ ఇద్దరు డిసెంబర్ 7న తిరుపతిలో జరిగే వెడ్డింగ్ ఈవెంట్‌తో ఒక్కటి కాబోతున్నారు. షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ మొదలుపెట్టిన సందీప్ రాజ్ డెబ్యూ సినిమా 'కలర్‌ఫొటో' ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. చాందినీ రావు కలర్‌ఫొటో, రణస్థలి, హెడ్ అండ్ టేల్స్‌తోపాటు పలు వెబ్ సిరీస్‌లలో నటించింది. చాందిని రావు ప్రొడక్షన్ హౌస్‌ను కూడా మెయింటైన్ చేస్తుంది. సందీప్ రాజ్ ప్రస్తుతం రోషన్ కనకాలతో సినిమా ప్రకటించగా.. ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ షురూ కానున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది.
ఇంకా చదవండి: నయన ప్రేమకథ అలా మొదలైంది..!?
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# కలర్‌ఫొటో # సందీప్‌రాజ్ # చాందినిరావు