29ఏళ్ల   వైవాహిక జీవితానికి ముగింపు!

29ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు!

1 month ago | 5 Views

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏ.ఆర్‌ రెహమాన్‌ తన భార్య సైరాభానుతో విడిపోతున్నట్లు ప్రకటించారు. దాదాపు 29 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. అదే సమయంలో ఏ.ఆర్‌ రెహమాన్‌ టీమ్‌లోని బాసిస్ట్‌ మోహిని దే సైతం భర్త మార్క్‌తో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ఏఆర్‌ రెహమాన్‌ దంపతులు విడిపోతున్నట్లుగా ప్రకటించిన కొద్దిగంటల్లోనే మోహిని సైతం డివోర్స్‌పై ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మోహిని, మార్క్‌ సంయుక్త ప్రకటనలో పరస్పర అవగాహనతో  ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. అయినా ఇద్దరం మంచి స్నేహితులుగా ఉంటామని.. జీవితంలో భిన్నమైన విషయాలను కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ముందుకు సాగేందుకు పరస్పర అంగీకారంతో విడిపోవడమే ఉత్తమమైన మార్గమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మోహిని కోల్‌కతా నివాసి కాగా.. ఆమె బాస్‌ ప్లేయర్‌. ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా షోల్లో ఏ.ఆర్‌ రెహమాన్‌తో కలిసి ప్రదర్శనలు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. ఇక ఏ.ఆర్‌ రెహమాన్‌ 1995లో సైరా భానును వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఖతీజా, రహీమా, అమీన్‌ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలకు పెళ్లయ్యింది. వైవాహిక బంధంలో ఏర్పడిన భావోద్వేగ క్షణం తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఏ.ఆర్‌ రెహమాన్‌ న్యాయవాది తెలిపారు. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నా.. ఉద్రిక్తలు, ఆందోళనలు వారి మధ్య గ్యాప్‌ను పెంచాయని.. ఆ అగాధాన్ని పూడ్చేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరన్నారు.

ఇంకా చదవండి: మాలీవుడ్‌ మల్టీస్టారర్‌ కోసం మమ్ముట్టి, మోహన్‌లాల్‌!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# ఏ.ఆర్‌ రెహమాన్‌     # సైరాభాను    

trending

View More