రాజ్‌కుంద్రా ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ దాడులు!
19 days ago | 5 Views
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నివాసాల్లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. పోర్న్ వీడియోలు తీసిన కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. రాజ్ కుంద్రా నివాసంతో పాటు కార్యాలయాల్లోనూ ఈడీ తనిఖీలు చేపడుతోంది. సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
ఔత్సాహిక నటీనటులతో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసిన కేసులో రాజ్ కుంద్రాను 2021 జూన్‌లో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముంబై పోలీసుశాఖకు చెందిన ప్రాపర్టీ సెల్.. పోర్న్ వీడియోలు చేస్తున్న ఓ ముఠాను పట్టుకోగా అప్పట్లో ఈ వ్యవహారం బయటపడిరది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల కోసం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నామన్న నెపంతో వాళ్లు పోర్న్ వీడియలు తీస్తున్నట్లు గుర్తించారు. పోర్న్ వీడియోలు షూట్ చేసిన తర్వాత.. వాటిని వీట్రాన్స్‌ఫర్ ద్వారా విదేశాలకు ఆ కామెంట్‌ను పంపిస్తారు. అయితే భారతీయ చట్టాల నుంచి తప్పించుకునేందుకు ఆ అశ్లీల చిత్రాలను అక్కడి యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ కేసును విచారిస్తున్న క్రైం బ్రాంచ్ పోలీసులకు ఈ విషయాలు తెలిశాయి. ఈ వ్యవహారంలో ఉమేశ్ కామత్ అనే వ్యక్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అతను రాజ్‌కుంద్రా వద్ద పనిచేసేవాడు. ఉమేశ్ కామత్‌ను అరెస్టు చేసిన తర్వాతే.. ఆ పోర్న్ రాకెట్‌లో కుంద్రా పాత్ర ఉన్నట్లు తేలింది. విచారణ అనంతరం పక్కా ఆధారాలతో 2021 జులై 20న రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు విడుదలయ్యారు.
ఇంకా చదవండి: బిజీగా మారిన త్రిష .. సినిమాల మీద సినిమాలు!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# రాజ్‌కుంద్రా # శిల్పాశెట్టి # ఉమేశ్‌కామత్