మీ అంచనాలను అందుకోలేననుకుంటే నా సినిమా చూడొద్దు : నాని
1 month ago | 5 Views
నా 16ఏళ్ల సినీ కెరీర్‌లో ‘దయ చేసి ఈ సినిమా చూడండి’ అని నేనెప్పుడూ అడిగింది లేదు. కానీ, ఈ చిత్ర విషయంలో ఆ మాట అడుగుతున్నా. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులెవరూ మిస్సవ్వకూడదని నా కోరిక. ఇది మీ అంచనాలను అందుకోలేదు అనిపిస్తే రెండు నెలల్లో విడుద కానున్న నా ‘హిట్ 3’ని ఎవరూ చూడొద్దు అని నాని అన్నారు. ఆయన సమర్పణలో ప్రియదర్శి ప్రధాన పాత్ర నటించిన చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. రామ్ జగదీశ్ తెరకెక్కించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ఈ నెల 14న థియేటర్లలో విడుదల కానుంది. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో ఈ చిత్ర ట్రైలర్‌ను నాని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి, నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెల, శైలేశ్ కొలను, శౌర్యువ్ తదితరులు పాల్గొన్నారు. నాని మాట్లాడుతూ.. ఈ రోజుల్లో సినిమాల్లోకి దూరిపోయి.. అందులోని పాత్రలకు ఎమోషన్‌తో కనెక్ట్ అయిపోయి.. వాటితోపాటు నవ్వి, ఏడ్చి.. ఆ చిత్ర ప్రపంచం లోకి తీసుకెళ్లే కథలు బాగా తగ్గిపోయాయి. కానీ, అలాంటి అనుభూతిని ‘కోర్ట్’తో నేను పొందగలిగా. ఇప్పుడా అనుభూతిని ప్రేక్షకులని పొందాలన్నది నా తాపత్రయం. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులెవరూ మిస్సవ్వకూడదని నా కోరిక. అందుకే ఇంతగా బతిమలాడుతున్నా. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ మంచి సినిమా చూశామనే గర్వంతో బయటకు వస్తారు. ఇది మీ అంచనాల్ని అందుకోలేదు అనిపిస్తే మరో రెండు నెలల్లో విడుదల కానున్న ‘హిట్ 3’ని ఎవరూ చూడొద్దు. ఇంతకంటే బలంగా నేనేమీ చెప్పలేను. ఎందుకంటే దీనికన్నా 10రెట్లు ఎక్కువగా ‘హిట్ 3’పై ఖర్చు పెట్టా. ఈ నెల 14 వరకే ‘ఈ సినిమా చూడమని అందరికీ చెప్తా. ఆ తర్వాత నుంచి మీరే ఆ మాట ప్రతి ఒక్కరికీ చెప్తారు’’ అన్నారు.
ఇంకా చదవండి: వీరి పిచ్చి పీక్స్‌లోకి వెళ్లింది.. వంద రూపాయల నోటుపై గాంధీజీ ప్లేస్‌లో అల్లుఅర్జున్ ఫొటో!
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"