జోరుగా సినీ తారల విరాళాలు..
3 months ago | 39 Views
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో తెలుగు సినీ పరశ్రమ నుంచి విరాళాలు వెళ్లువెత్తుతున్నాయి. జూ. ఎన్టీఆర్‌తో ప్రారంభమైన ఈ సాయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మంగళవారం రోజున జూ. ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, కథానాయిక అనన్య నాగళ్ల, యాంకర్ స్రవంతి, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, వంశీ, ఆయ్ మూవీ టీం తమవంతు సాయంగా ప్రకటించిన ఇషయం తెలిసిందే.
తాజాగా బుధవారం మెగాస్టార్ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల సాయం ప్రకటించగా, అదేబాటలో రామ్ చరణ్ తనవంతుగా రెండు రాష్టాల్రకు రూ.50 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. అల్లు అర్జున్ కూడా తనవంతుగా రెండు రాష్టాల్రకు రూ.50 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. ఇక పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కోటి చొప్పున రెండు కోట్ల విరాళం ప్రకటించి తన సేవాగుణాన్ని మరో సారి చాటుకున్నాడు. అదే విధంగా కమెడియన్ అలీ ఆంధ్రప్రదేశ్‌కు రూ.3 లక్షలు, తెలంగాణకు రూ.3 లక్షల చొప్పున రూ.6లక్షల విరాళం ప్రకటించారు. కోట శ్రినివాసరావు లక్ష సాయం ప్రకటించారు.
ఇంకా చదవండి: 'ది గోట్' లో నన్ను నేను రిలేట్ చేసుకునే క్యారెక్టర్ చేశాను: హీరోయిన్ మీనాక్షి చౌదరి