సూర్యకు జోడీగా బుట్టబొమ్మ!

సూర్యకు జోడీగా బుట్టబొమ్మ!

1 month ago | 13 Views

సూర్య కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూన్‌ తొలి వారం నుంచి అండమాన్‌ దీవుల్లో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన ప్రధాన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది  చిత్ర బృందం. ఇందులో భాగంగా సూర్యకు జోడీగా పూజా హెగ్డేను ఖరారు చేసినట్లు సమాచారం.

ఇప్పటికే ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు పూర్తయినట్లు తెలిసింది. ప్రేమ, వినోదం, యాక్షన్‌ అంశాలతో నిండిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. తొలి షెడ్యూల్‌ దాదాపు 40రోజులకు పైగా సాగనున్నట్లు తెలుస్తోంది. దీంట్లో మలయాళ నటుడు జోజు జార్జ్‌ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇంకా చదవండి: మహేష్ బాబు - జక్కన్నసినిమా కోసం పృథ్వీరాజ్‌.. ఎక్స్‌లో వైరల్‌గా మారిన వార్త!

# Surya     # PoojaHegde     # TeluguCinema