నా విలువను పెంచదు : పీఆర్‌ ఏజెన్సీపై సాయి పల్లవి కామెంట్స్‌

నా విలువను పెంచదు : పీఆర్‌ ఏజెన్సీపై సాయి పల్లవి కామెంట్స్‌

1 month ago | 5 Views

ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్న భామల్లో ఒకరు సాయి పల్లవి. ఈ బ్యూటీ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి అమరన్‌. శివకార్తికేయన్‌ నటిస్తోన్న ఈ చిత్రం అక్టోబర్‌ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. సాధారణంగా బాలీవుడ్‌ సెలబ్రిటీలు తమ స్టార్‌డమ్‌, మార్కెట్‌ను పెంచుకునేందుకు పీఆర్‌ ఏజెన్సీలను పెట్టుకుంటారని తెలిసిందే. అమరన్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సాయిపల్లవి బీటౌన్‌లో పీఆర్‌ మాఫియా గురించి చెప్పుకొచ్చింది.  తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి పీఆర్‌ ఏజెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిందట సాయిపల్లవి. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. బాలీవుడ్‌కి చెందిన ఓ వ్యక్తి ప్రొఫెషనల్‌గా నా ఇమేజ్‌ను మరింత పెంచుకునేందుకు ఏజెన్సీ అవసరమా..? అని అడిగాడు. అలా చేస్తే నేను లైమ్‌లైట్‌లో ఉంటా. అందరూ నా గురించి మాట్లాడతారని అతడు చెప్పాడు. నేను మాత్రం వద్దని చెప్పాను.


ఎందుకంటే పీఆర్‌ ఏమీ ఇవ్వదు. అంతేకాదు పీఆర్‌ నా విలువను పెంచదు. నా గురించి తరచూ మాట్లాడితే జనాలకు విసుగు వస్తుంది. నేను ఖాళీ పబ్లిసిటీ కంటే నిజమైన అనుబంధానికి ఎక్కువ విలువ ఇస్తానని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. ఇప్పుడీ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సాయిపల్లవి మరోవైపు నాగచైతన్య హీరోగా నటిస్తోన్న 'తండేల్‌'లో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఇందులో శ్రీకాకుళం అమ్మాయి సత్యగా కనిపించనుంది. హిందీలో రామాయణతోపాటు టైటిల్‌ ఫిక్స్‌ కాని మరో సినిమా కూడా చేస్తోంది.

ఇంకా చదవండి: సినిమా చూసి నటుడిని కొట్టిన మహిళ!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# అమరన్‌     # శివకార్తికేయన్‌     # సాయిపల్లవి    

trending

View More