దర్శకధీరుడు రాజమౌళిపై డాక్యుమెంటరీ!
4 months ago | 71 Views
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ విడుదలైంది. ’మోడ్రన్ మాస్టర్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ డాక్యుమెంటరీ తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను నెట్‌ప్లిక్స్ పంచుకుంది. అందులో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు రాజమౌళిపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్‌లతో పాటు హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్, బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహర్‌లు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఇంకా చదవండి: 'ఉలాజ్'తో ముందుకొచ్చిన జాన్వీ!
# SSRajamouli # ModernMasters # OTT