'ట్రిపుల్‌ఆర్‌'పై డాక్యుమెంటరీ!

'ట్రిపుల్‌ఆర్‌'పై డాక్యుమెంటరీ!

12 days ago | 5 Views

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో నటించగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ కథానాయికగా నటించింది. డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రం ఈ సినిమా 2021లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ అందుకోవడమే కాకుండా ఆస్కార్‌ అవార్డును గెలుచుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించి నేటికి 6 ఏండ్లు అవుతున్న సందర్భంగా.. చిత్రయూనిట్‌ సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది.

RRR - Rajamouli: దర్శక బాహుబలి ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళికి మరో అరుదైన  గౌరవం..

ఈ సినిమాపై డాక్యుమెంటరీ రాబోతున్నట్లు ప్రకటించింది. ప్రపంచం మొత్తం ఈ సినిమా కీర్తిని చూసింది. ఇప్పుడు లోతులను చూస్తారు అంటూ పేరిటా డాక్యుమెంటరీ చిత్రంను అనౌన్స్‌ చేసింది. ఇక ఈ డాక్యును డిసెంబర్‌లో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీ డాక్యుమెంటరీ హాక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇంకా చదవండి: నా ఫిట్‌నెస్‌కు కారణం అదే...!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# ఆర్‌ఆర్‌ఆర్‌     # రాజమౌళి     # ఎన్టీఆర్‌     # రామ్‌చరణ్‌    

trending

View More