'గేమ్ ఛేంజర్'కు డైరెక్టర్ శంకర్ భారీ ప్లాన్!?
1 month ago | 5 Views
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం 'గేమ్‌ఛేంజర్'. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు సుందరి అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ అప్‌డేట్ రానే వచ్చింది. తాజా టాక్ ప్రకారం నవంబర్ 9న 'గేమ్ ఛేంజర్' టీజర్ లాంచ్ చేయబోతున్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌ను లక్నోలో నిర్వహించనున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. మొత్తానికి శంకర్ ఈ సారి రూటు మార్చి ఏకంగా నార్తిండియాలో ప్లాన్ చేసి భారీ స్కెచ్ వేశాడని అర్థమవుతోంది. ఈ మూవీని 2025 జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తున్నాడు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఇంకా చదవండి: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ చేంజర్’ సినిమా యూనివర్సల్‌గా అందరినీ అలరిస్తుంది - నిర్మాత దిల్ రాజు
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# గేమ్ ఛేంజర్ # శంకర్ # రామ్ చరణ్