ఆవిూర్‌తో విడిపోయాకా బాగానే ఉన్నా.. దర్శకురాలు కిరణ్‌ రావు వెల్లడి!

ఆవిూర్‌తో విడిపోయాకా బాగానే ఉన్నా.. దర్శకురాలు కిరణ్‌ రావు వెల్లడి!

5 months ago | 42 Views

ఆమిర్‌ఖాన్‌తో వైవాహిక జీవితానికి స్వస్తి పలకడంపై ఆయన మాజీ సతీమణి, దర్శకురాలు కిరణ్‌రావు స్పందించారు. విడాకుల తర్వాత తాను కుంగిపోలేదని, సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఇరు కుటుంబాలు తనకు అండగా ఉన్నాయని చెప్పారు. సంబంధాలు ఎప్పటికప్పుడు పునర్నిర్మించబడాలని నేను భావిస్తున్నా. ఎందుకంటే, మనం పెరిగేకొద్దీ మనుషులుగా మారతాం. సుమారు 16 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నప్పుడు ఎమోషనల్‌, మానసికంగా దానిని తట్టుకోవడానికి కాస్త సమయం పట్టింది. విడాకుల తర్వాత సంతోషంగా ఉంటాననుకున్నా. అదే జరిగింది. ఆమిర్‌ నా జీవితంలోకి రావడానికి ముందు చాలా ఏళ్లు సింగిల్‌గానే ఉన్నా.

నా స్వతంత్రతను ఎంజాయ్‌ చేశా. కాకపోతే అప్పట్లో కొన్నిసార్లు ఒంటరిగా ఫీలయ్యా. కానీ, ఇప్పుడు అలా కాదు. నా కొడుకు ఆజాద్‌ ఉండటంతో ఒంటరితనం నా దరి చేరదు. ఇరు కుటుంబాల నుంచి నాకు సపోర్ట్‌ ఉంది. ఆమిర్‌తో ఇప్పటికీ నాకు మంచి అనుబంధం ఉంది‘ అని చెప్పారు.ఆమిర్‌ఖాన్‌ నటించిన 'లగాన్‌’కు కిరణ్‌రావు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు. 2005లో ఆమిర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. పరస్పర అంగీకారంతో సుమారు 16 ఏళ్ల వైవాహిక బంధానికి 2021లో స్వస్తి పలికారు. కిరణ్‌రావును వివాహం చేసుకోవడానికంటే ముందు ఆమిర్‌కు వివాహమైన విషయం తెలిసిందే. వర్క్‌ విషయానికి వస్తే.. దర్శక నిర్మాతగా కిరణ్‌రావుకు బాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. ఇటీవల ;లాపతా లేడీస్‌’తో దర్శకురాలిగా మంచి విజయాన్ని అందుకున్నారు.

ఇంకా చదవండి: ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్‌ మూవీ చేయాలనుంది: హీరో ధనుష్‌

# AamirKhan     # IraKhan     # NupurShikhare     # kiranrao     # Bollywood    

trending

View More