దర్శకుడు హరీశ్‌ శంకర్‌ పెద్దమనసు... 'మిస్టర్‌ బచ్చన్‌' ఫెయిల్యూర్‌తో 2కోట్లు వాపస్‌!

దర్శకుడు హరీశ్‌ శంకర్‌ పెద్దమనసు... 'మిస్టర్‌ బచ్చన్‌' ఫెయిల్యూర్‌తో 2కోట్లు వాపస్‌!

3 months ago | 31 Views

మాస్‌ మహారాజ రవితేజ, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన తాజా చిత్రం 'మిస్టర్‌ బచ్చన్‌’ ’నామ్‌ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. షాక్‌, మిరపకాయ్‌ వంటి సూపర్‌ హిట్‌ సినిమాల తర్వాత రవితేజ, హరీశ్‌ శంకర్‌ కాంబోలో ఈ సినిమా రావడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ అంచనాలను అందుకోలేక పోయింది ఈ చిత్రం. ఇండిపెండెన్స్‌ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా.. ఫస్ట్‌ షో నుంచే మిక్స్‌డ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టార్‌ అందుకోవడమే కాకుండా.. సోషల్‌ విూడియాలో విపరీతంగా ట్రోల్‌ అయ్యింది ఈ చిత్రం. అయితే ఈ సినిమాకు వచ్చిన నష్టాల వలన దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తుంది. ఈ మూవీ వలన నష్టపోయిన నిర్మాతకు హరీశ్‌ శంకర్‌ తన రెమ్యూనరేషన్‌ నుంచి రూ.2 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు సోషల్‌ విూడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు హరీశ్‌ శంకర్‌ దర్శకుడిగా రూ.10 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు సమాచారం. ఇందులో నుంచే నిర్మాతకు రూ.2 కోట్లు తిరిగి ఇచ్చినట్లు టాక్‌. అయితే హరీశ్‌ శంకర్‌ చేసిన పనికి రవితేజ అభిమానులతో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది.

ఇంకా చదవండి: హేమ కమిటీ రిపోర్ట్‌ గురించి అడక్కండి:హీరోయిన్‌ ఆండ్రియా జెర్మయ్య

# MrBachchan     # RaviTeja     # HariShankar    

trending

View More