దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మంచు మనోజ్
4 months ago | 38 Views
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ’నేను విూకు తెలుసా’ దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని హీరో మనోజ్ సోషల్ విూడియా వేదికగా తెలిపారు. ఆయన మరణం తనను ఎంతో బాధించిందంటూ మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆయనతో దిగిన ఫొటోలను పంచుకుంటూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ’నా మిత్రుడు, ’నేను విూకు తెలుసా’ దర్శకుడు అజయ్ శాస్త్రి ఇక లేరనే వార్త కలచి వేస్తోంది. మాటల్లో వర్ణించ లేనంత బాధగా ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నా. చాలా త్వరగా వెళ్లిపోయావ్ అజయ్. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. ఇది కల అయితే బాగుండనిపిస్తోంది. నువ్వు లేకుండా జీవితం ఎప్పటిలా ఉండదు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని రాసుకొచ్చారు. మంచు మనోజ్ నటించిన ’నేను విూకు తెలుసా’చిత్రం 2008లో విడుదలై.. హిట్‌గా నిలిచింది. అజయ్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఇది.
ఇంకా చదవండి: ప్రతిభ నిరూపించుకునే పాత్ర అది: మేఘా ఆకాశ్
# ManchuManoj # AjaySastri # Socialmedia