'ఎమర్జెన్సీ'కి విడుదల కష్టాలు
2 months ago | 30 Views
బాలీవుడ్ క్వీన్, మండి లోక్‌సభ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కీ రోల్‌లో నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ’ . దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం గతేడాది నవంబరు 24న విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన విడుదల వాయిదా పడింది. . ఆ తర్వాత కూడా ఈ సినిమా థియేటర్స్ వద్దకు వెళ్లలేదు. ఇక ఇప్పటి వరకూ ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ జారీ చేయలేదు. దీనిపై కంగన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ ఆలస్యమయ్యే కొద్దీ ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని ఏ విధంగా తెరకెక్కించానో నాకు తెలుసు. చిత్ర పరిశ్రమ నుంచి నాకు ఎలాంటి మద్దతూ లభించలేదు. జీ, కొందరు వ్యక్తుల భాగస్వామ్యంతో దీన్ని నిర్మించాను. ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కారణంగా ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాం. మా చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాల్సిన బాధ్యత సెన్సార్‌పై ఉంది’ అని కంగన ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1972లో విధించిన ఎమర్జెన్సీ కాలంనాటి రాజకీయ పరిణామాల గురించి ఈ సినిమాలో వివరించారు. అయితే, సిక్కుల మతస్థుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ సినిమా తీశారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ఆరోపిస్తోంది. అకాల్ తఖ్త్ సాహిబ్‌పై బాంబు దాడి, ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జెన్సీ టైంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను విస్మరిస్తూ.. కథను పూర్తిగా ఒకవైపు మాత్రమే చూపించారని కొన్ని వర్గాలు సినిమాని వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతిభద్రతలకు ముప్పు ఉందనే కారణంతో సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఇచ్చేందుకు నిరాకరించడంపై స్పందించింది. ఈ నెల 25లోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.ఈ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా చౌదరి, మిలింద్ సోమన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇంకా చదవండి: వెంకటేశ్ మూవీ సెట్‌లో బాలయ్య సందడి!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!