'పుష్ప' రికార్డును దాటిన దేవర..  ఎన్టీఆర్‌కు విషెస్‌ చెప్పిన నటుడు సుమన్‌!

'పుష్ప' రికార్డును దాటిన దేవర.. ఎన్టీఆర్‌కు విషెస్‌ చెప్పిన నటుడు సుమన్‌!

3 months ago | 39 Views

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దేవర’ భారీ అంచనాల మధ్య ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. విడుదలకు ముందే ప్రీ సేల్‌లో పలు రికార్డులు సృష్టించిన ఈ సినిమా గురించి తాజాగా నటుడు సుమన్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఎన్టీఆర్‌ ఎంతో అదృష్టవంతుడు. విడుదలకు ముందు ఇన్ని రికార్డులు సాధించడమంటే మాటలు కాదు. అందరి నటులకు ఇది సాధ్యం కాదు. స్టోరీ, దర్శకుడు, టీమ్‌ వల్ల కూడా 'దేవర’కు క్రేజ్‌ ఏర్పడింది.  ఎన్టీఆర్‌ చిన్నప్పటినుంచి క్లాసికల్‌ డ్యాన్సర్‌. అందుకే ఆయన ఏ డ్యాన్స్‌ వేసినా గ్రేస్‌ ఉంటుంది. డైలాగ్స్‌ చెప్పడం తారక్‌కు చిన్నప్పటి నుంచి అలవాటే. వాటిలో ఆయన మాస్టర్‌. అలాగే ఫైట్స్‌పై కూడా ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆర్టిస్ట్‌గా తెరపై ఏం చేయాలనే విషయం తారక్‌కు బాగా తెలుసు. ఎంతో అంకితభావం, నిబద్ధత ఉన్న వ్యక్తి. అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ప్రతీ సన్నివేశాన్ని టీమ్‌తో చర్చిస్తారు. సలహాలు, సూచనలు ఇస్తారు.

ఆయనతో కలిసి మరోసారి వర్క్‌ చేసేందుకు ఎదురుచూస్తున్నా. 'దేవర’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అంటూ చిత్రబృందానికి సుమన్‌ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఇప్పటికే పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న 'దేవర’. తాజాగా మరోసారి సత్తా చాటింది. బుక్‌మైషోలో.. 'పుష్ప2’ను దాటేసింది. ఈ రెండు సినిమాలు చూడడానికి ఎంతమంది ఆసక్తి చూపుతున్నారో తాజాగా బుక్‌ మై షో విడుదల చేసింది. అందులో ఇప్పటివరకు 'పుష్ప2’ కోసం 3 లక్షల 34వేల మంది ఆసక్తి కనపరచగా.. 'దేవర’ కోసం 3 లక్షల 36వేల మంది ఎదురుచూస్తున్నారు. 'దేవర’ విషయానికొస్తే..'జనతా గ్యారేజ్‌’ తర్వాత హీరో ఎన్టీఆర్‌-డైరెక్టర్‌ కొరటాల శివ  కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. జాన్వీ కపూర్‌ ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇంకా చదవండి: వివాహ బంధంతో ఒక్కటైన నటుడు సిద్దార్థ్‌ , నటి అదితిరావు హైదరీ

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Devara     # JrNtr     # SaifAliKhan     # PrakashRaj     # JanhviKapoor     # OTT    

trending

View More