'దేవర'  సెన్సార్‌ పూర్తి...  2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల రన్‌టైమ్‌!

'దేవర' సెన్సార్‌ పూర్తి... 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల రన్‌టైమ్‌!

5 days ago | 9 Views

ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం 'దేవర’. పార్ట్‌ 1 ఈ నెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. నిడివి: 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు. ఇటీవల బాక్సాఫీసు ముందుకొచ్చిన పలు చిత్రాల నిడివి దాదాపు 3 గంటలు ఉండటం గమనార్హం. కంటెంట్‌ బాగుంటే రన్‌టైమ్‌ ఎంతున్నా ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందనే విషయాన్ని 'కల్కి’ (180.56 నిమిషాలు), 'సరిపోదా శనివారం’ (2: 50 గంటలు)లాంటి చిత్రాలు మరోసారి నిరూపించాయి. 

'జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో ముందు నుంచీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్‌ అంటూ ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ అంచనాలు రెట్టింపు చేశారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లోకి వస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. నార్త్‌ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్ల ప్రీ సేల్‌ ద్వారానే వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా 'దేవర’ నిలిచిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌ కూడా రిలీజ్‌ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

ఇంకా చదవండి: రాజమౌళి సినిమాతోనే నేరుగా హిందీలోకి.. పాత సినిమాలను డబ్‌ చేయవద్దన్న మహేశ్‌ ?

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Devara     # JrNTR     # Janhvikapoor     # September27    

trending

View More