'దేవర' ప్రమోషన్స్ జోరు.. సందీప్ వంగాతో టీమ్ చిట్‌చాట్
3 months ago | 37 Views
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా 'దేవర’ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రచారం జోరు పెంచింది. 'యానిమల్’ దర్శకుడు సందీప్ వంగాతో 'దేవర’ టీమ్ చిట్‌చాట్ నిర్వహించింది. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. 35రోజులు అండర్ వాటర్ సీక్వెన్స్ చేసినట్లు ఎన్టీఆర్ చెప్పగా.. 'దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. ఈ సినిమా రన్ టైమ్ పై సందీప్ సరదాగా కామెంట్ చేశారు. ఇటీవల ముంబైలో ట్రైలర్‌ను విడుదల చేశారు.అనంతరం 'యానిమల్’ దర్శకుడు సందీప్ వంగాతో 'దేవర’ టీమ్ చిట్‌చాట్ నిర్వహించింది.
దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. సందీప్ అడిగిన ప్రశ్నలకు తారక్ తనదైన శైలిలో జవాబిచ్చారు. ఇదొక యాక్షన్ డ్రామా అని, మాస్ ఎలిమెంట్స్‌లో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు తారక్. చాలా సంవత్సరాలుగా తారక్, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్ గురించి చెప్పారు. విూరు సినిమా కథ అంతా చెప్పేయమంటున్నారు అని జాన్వీ సందీప్‌పై పంచ్‌లు విసిరింది. ఈ సినిమా రన్ టైమ్ పై సందీప్ సరదాగా కామెంట్ చేశారు. దానికి తారక్ యానిమల్ రన్ టైమ్ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్ రెడ్డి వంగా చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
ఇంకా చదవండి: గీతరచయిత గురుచరణ్ కన్నుమూత
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Devara # JrNTR # Janhvikapoor # September27