'దేవర' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌... మహేశ్‌బాబు గెస్ట్‌ అంటూ ప్రచారం

'దేవర' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌... మహేశ్‌బాబు గెస్ట్‌ అంటూ ప్రచారం

11 hours ago | 11 Views

'దేవర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌పై వార్తలు దుమారం రేపుతున్నాయి. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నటుడు మహేశ్‌బాబు వస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలో సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తరువాత ఎన్టీఆర్‌ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్‌ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్‌లో బుకింగ్స్‌ స్టార్ట్‌ అవ్వగా 5 లక్షలకు పైగా టికెట్స్‌ బుక్‌ అయినట్లు మేకర్స్‌ ప్రకటించారు. మరోవైపు రీసెంట్‌గా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇదిలావుంటే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ భారీ ఎత్తున్న ప్లాన్  చేస్తున్నట్లు తెలుస్తుంది.


అయితే ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు టాలీవుడ్‌ నుంచి సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుని పిలవాలని 'దేవర' టీం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భరత్‌ అనే నేను ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ చీఫ్‌ గెస్ట్‌గా వచ్చి సందడి చేశాడు. దీంతో అప్పటినుంచి మహేశ్‌- తారక్‌ల మధ్య బాండింగ్ మరింత ఎక్కువ అయ్యింది. అయితే ఈ ఈవెంట్‌కు మాత్రం మహేశ్‌ వస్తే అభిమానులకు ఆనందానికి హద్దు లేకుండా పోతుందని చెప్పవచ్చు. హై వోల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు జనతా గ్యారేజ్‌ ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుంది. సైఫ్‌ అలిఖాన్‌ విలన్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ప్రకాశ్‌ రాజ్‌, శ్రీకాంత్‌, గెటప్‌ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇంకా చదవండి: 'పుష్ప' రికార్డును దాటిన దేవర.. ఎన్టీఆర్‌కు విషెస్‌ చెప్పిన నటుడు సుమన్‌!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Devara     # JrNTR     # Janhvikapoor     # Maheshbabu     # September27    

trending

View More