'దేవర' ప్రీ రిలీజ్ రద్దు..పుష్ప మేకర్స్ జాగ్రత్తలు!
2 months ago | 37 Views
'దేవర’సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అవ్వడంతో అభిమానులు చేసిన రచ్చ చేయడంతో..అలాంటి పరిస్థితి రాకుండా పుష్పయూనిట్ తగిన జాగ్రత్తలు తీసుకోనుందని ఆ సినిమా ప్రొడ్యూసర్ వై. రవి శంకర్ తెలిపారు. ఇటీవల రిలీజై సూపర్ హిట్ అందుకున్న మత్తు వదలరా-2 సినిమా సక్సెస్ విూట్‌లో ఆయన విూడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విూడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఈ ఘటన బాధని కలిగించిందని నేను కూడా ఈ ఈవెంట్‌కి హాజరు కావాల్సిందని తెలిపారు.
పుష్ప ప్రీ రిలీజ్ ని ఔట్ డోర్ ఈవెంట్‌గానే ప్లాన్ చేస్తామని చెప్పారు. అభిమానులని దృష్టిలో ఉంచుకొనే తగిన ఏర్పాట్లు పకడ్బందీగా ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు. అలాగే దేవర టికెట్ ప్రైజ్ హైక్ విషయంలో ఏపీ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా పుష్ప టికెట్స్ విషయంలోనూ సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు పుష్ప పై వస్తున్న అనవసర రూమర్స్‌కి విూడియా ఆజ్యం పోయకుండా సహకరించాలని కోరారు. మొదటి పార్ట్ పుష్పతో దేశ వ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ సాధించిన ఈ సినిమా రెండవ పార్ట్ పుష్ప డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడదల కానుంది. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ ఆడియెన్స్‌లో బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.
ఇంకా చదవండి: ఆస్కార్‌కు 'లాపతా లేడీస్' ఎంపిక!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!