యాక్షన్ డ్రామాగా 'దేవర' మూవీ.. సందీప్ వంగాతో ఎన్టీఆర్ తదుపరి చిత్రంపై ర్యూమర్స్!
3 months ago | 36 Views
ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర’లోని పాట విడుదలైన దగ్గర నుంచి రోజూ హీరో ఎన్టీఆర్ పేరు టాప్‌లో కొనసాగుతోంది. తాజాగా 'దేవర’ ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్ పంచుకోవడం, ఎన్టీఆర్ ప్రమోషన్స్ కోసం ముంబయి వెళ్లడం, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాను కలవడం.. ఇలాంటి విశేషాలతో నేడు యంగ్ టైగర్ పేరు విూద పోస్ట్‌లు తెగ షేర్ అవుతున్నాయి. ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం 'దేవర’. సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ ముంబయి వెళ్లారు. అక్కడ అభిమానులతో కలిసి సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు ఎక్స్‌లో షేర్ అవుతున్నాయి. యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతోన్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది. అందులో ఎన్టీఆర్ పవర్‌ఫుల్‌లో కనిపిస్తున్నారు. కత్తి పట్టుకొని సముద్రంలో నడుస్తున్నట్లు చూపించారు. మూవీ యూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారంలో భాగంగా ముంబయి వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ స్టార్ దర్శకుడు సందీప్ వంగాను కలిశారు. ఈఫొటో బయటకు వచ్చిన దగ్గర నుంచి రకరకాల చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం సందీప్ వంగా ’స్పిరిట్’ పనుల్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా తీసే అవకాశం ఉందని కొందరు చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం 'దేవర ప్రమోషన్ భాగంగా సందీప్ వంగా ఈ టీమ్‌ను ఇంటర్వ్యూ చేస్తారని అనుకుంటున్నారు. ఎన్టీఆర్-సందీప్‌ల ఫొటో మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.
'దేవర’ టీమ్ ఇటీవల మూడో పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 'కొరవిూనా నిన్ను కోసుకుంటా ఇయ్యాల... పొయివిూన మరిగిందె మస్సాలా...’ అంటూ మొదలయ్యే ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రచించగా, అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు. ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్, జాన్వీ కపూర్ అందం, ఆ ఇద్దరి మధ్య కెమిస్టీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని టాప్‌లో కొనసాగుతోంది. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఓవర్సీస్‌లో దీని ప్రీసేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కొన్ని గంటల్లోనే 8లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందు ఈ స్థాయిలో సేల్ అయ్యాయంటే ఇది రిలీజ్ అయ్యాక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అనుకుంటున్నారు.ట్రైలర్ రిలీజ్ కంటే ముందే వన్‌మిలియన్ మార్క్ చేరుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ’దేవర’ విషయానికొస్తే.. ’జనతా గ్యారేజ్’ తర్వాత హీరో ఎన్టీఆర్` డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. జాన్వీ కపూర్ ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంకా చదవండి:రజనీకాంత్‌పై విఘ్నేష్ లైవ్ ఫాడ్‌కాస్ట్.. గిన్నిస్ రికార్డులో 50 గంటల నిర్విరామ ప్రదర్శన!