ఫ్లాప్ అయినా భలేగా కలెక్షన్లు.. 'ఆదిపురుష్'పై దర్శకుడు ఓం రౌత్
3 months ago | 49 Views
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి కృతి సనన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ఆదిపురుష్ ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ప్లాప్‌గా నిలిచింది. ఇక ప్రభాస్ రాధేశ్యామ్ తర్వాత మరో డిజాస్టార్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా డిజాస్టార్‌పై దర్శకుడు ఓం రౌత్ స్పందించాడు. ఆదిపురుష్ అభిమానుల అంచనాలను అందుకోలేక పోయిందని అయితే ఈ సినిమా ప్లాప్ అందుకున్న బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించిందని తెలిపాడు.
ఇక ఆదిపురుష్ విడుదలయిన అనంతరం తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందిస్తూ.. సోషల్‌విూడియాలో ముక్కు, ముఖం తెలియని వాళ్లు చేసే ట్రోల్స్‌ను మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద మంచిగా ఆడిరది. ఈ సినిమా తొలిరోజే రూ.70 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇందులో తెలంగాణ. ఆంధ్రా నుంచే రూ.200 కోట్ల వరకు వచ్చాయి. దీన్ని బట్టి చెప్పవచ్చు ఈ సినిమా హిట్ అయ్యిందా అనేది అంటూ రౌత్ చెప్పుకొచ్చాడు.
ఇంకా చదవండి: ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్..... ప్రభాస్‌పై విక్రమ్ ప్రశంసల వర్షం
# Adipurush # Prabhas # Omraut