కెరీర్‌ ప్రారంభంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా : రకుల్‌ ప్రీత్ సింగ్

కెరీర్‌ ప్రారంభంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా : రకుల్‌ ప్రీత్ సింగ్

2 months ago | 5 Views

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా  ఇండస్ట్రీకి వచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తన కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో అవకాశాలు కోల్పోయానని చెప్పిన రకుల్‌.. గతంలో ప్రభాస్‌ సినిమా నుంచి తనను తొలగించడం గురించి మరోసారి మాట్లాడారు. ఓ ఆంగ్ల విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌ సినిమాలో తన స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు వెల్లడించారు.  ''ప్రభాస్‌  సరసన ఓ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఒక షెడ్యూల్‌ను కూడా చిత్రీకరించారు. అప్పుడు నేను దిల్లీలో చదువుకుంటున్నా. దీంతో  షెడ్యూల్‌ పూర్తి కాగానే తిరిగి దిల్లీ వెళ్లిపోయా. అక్కడికి వెళ్లాక రెండో షెడ్యూల్‌ కోసం ఎన్ని రోజులైనా ఫోన్‌ రాలేదు. నా స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు తర్వాత తెలిసింది. నాకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆ సినిమా నుంచి తొలగించేశారు. అప్పటికే ప్రభాస్‌- కాజల్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చి మంచి విజయం సాధించింది.

దీంతో మరోసారి ఆ జోడి రిపీట్‌ అయితే బాగుంటుందని భావించిన చిత్రబృందం నన్ను తొలగించి తనను తీసుకుంది. సినిమా అనేది ఓ వ్యాపారం.. ఇందులో కొత్తగా పరిశ్రమకు వచ్చిన అమ్మాయిలకు ఇలా జరగడం సహజమే. నాకు ఎన్నోసార్లు ఇలా జరిగింది. ఒక అవకాశం పోయినా.. దానికి మించింది మన కోసం ఎదురు చూస్తుంటుం దని నేను భావిస్తా'' అని రకుల్‌ చెప్పారు. గతంలోనూ రకుల్‌ నెపోటిజం కారణంగా తనకు అవకాశాలు రాలేదని వెల్లడించారు. సినిమా ఛాన్స్‌లు కోల్పోవడం జీవితంలో ఓ భాగం. నాకు దక్కని వాటి గురించి ఆలోచించి సమయం వృథా చేసుకోను. ఏం చేస్తే నేను వ్యక్తిగతంగా ఎదుగుతానో దానిపై శ్రద్ధ పెడతాను. ఒక స్టార్‌ కిడ్‌కు లభించినంత సులభంగా మిగతా వారికి ఛాన్స్‌లు రావు. అదంతా వారి తల్లిదండ్రుల కష్టం అని రకుల్‌ వివరించారు. ప్రస్తుతం అజయ్‌దేవగణ్‌ జంటగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌  'దే దే ప్యార్‌ దే 2’లో నటిస్తున్నారు. విజయ వంతమైన 'దే దే ప్యార్‌ దే’కి కొనసాగింపుగా అన్షుల్‌ శర్మ దీన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఇది విడుదల కానుంది

ఇంకా చదవండి: 'కంగువా' డబ్బింగ్‌లో ఏఐ ఉపయోగం : నిర్మాత కే.ఈ జ్ఞానవేల్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# DeDePyaarDe2     # RakulPreetSingh     # AjayDevgan    

trending

View More