'దళపతి 69' విజయ్ సినిమా బాలయ్య సినిమాకి రీమెకింగా..?
1 month ago | 5 Views
దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఆయన నటించనున్న చివరి సినిమాగా 69’ని ప్రకటించిన విషయం తెలిసిందే. ‘తుణివు, వలిమై’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకుడు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ‘బీస్ట్’ తర్వాత మరోసారి విజయ్‌తో జతకడుతోంది. బాబీ డియోల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా అనే టాక్ వినిపిస్తోంది. దానికి తగిన ఆధారాలు కూడా కనిపించడంతో ఈ వార్తలకు మరింత ఊపు వచ్చింది.
ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆధారాలు ఏంటంటే.. ఈ యాక్షన్ డ్రామా సినిమాని గతేడాది దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’ సినిమా రీమేక్‌గా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. దళపతి 69’ సినిమాలో ఒక పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌ని సంప్రదించారు. అయితే ఆయన క్యరెక్టర్ లెంగ్త్ తక్కువ ఉందని, అలాగే చనిపోయే క్యారెక్టర్ అని రిజెక్ట్ చేశారట. అయితే ఈ రోల్ భగవంత్ కేసరిలో బాలకృష్ణ స్నేహితుడిగా నటించిన శరత్ కుమార్ పాత్ర పోలికలతో సరితూగుతుంది. మరోవైపు ఈ సినిమా యూనిట్ ఆర్మీ క్యాంప్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ ‘మమిత బైజు’ శ్రీలీలను పోలిన పాత్ర చేస్తున్నట్లు టాక్.
ఇక విలన్ అర్జున్ రాంపాల్ ప్లేస్‌లో బాబీ డియోల్ నటించనున్నారు. కాజల్ ప్లేస్‌లో పూజ హెగ్డే కనిపించనున్నారు. ఈ పోలికలు ఈ సినిమా బాలయ్య సినిమా రీమేక్ అనే వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. డైరెక్టర్ హెచ్ వినోద్ గతంలో బాలీవుడ్ ‘పింక్’ చిత్రాన్ని కోలీవుడ్ లో కమర్షియల్‌గా తీర్చిదిద్ది హిట్ అందుకున్నారు. 'వకీల్ సాబ్' సినిమాలో కమర్షియల్ హంగులకు వేణు శ్రీరామ్‌ని ఇన్‌స్పైర్ చేసింది ఈ డైరెక్టరే. ఈ గాసిప్‌లో నిజం ఎంతవరకు ఉందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా అక్టోబర్, 2025లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
ఇంకా చదవండి: రిలీజ్‌కు ముందే 'పుష్ప 2' రికార్డు!