నాన్న చిన్నప్పుడు అలా అనేవారు.. : సమంత

నాన్న చిన్నప్పుడు అలా అనేవారు.. : సమంత

1 month ago | 5 Views

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇంట్లో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సమంత తండ్రి జోసెఫ్‌ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్‌ తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. ’’మనం మళ్లీ కలిసే వరకు నాన్న’’. అంటూ హార్ట్‌ బ్రేకింగ్‌ ఎమోజీని జత చేశారు. ఇక జోసెఫ్‌ ప్రభు చనిపోవడానికి గల కారణం అనారోగ్య సమస్యలు అని తెలుస్తుంది. సామ్‌ తండ్రి చనిపోయిన వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా తమ సంతాపం ప్రకటించారు. కాగా తండ్రి గురించి సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ గా మారాయి. ‘‘మా నాన్న కూడా చాలామంది ఇండియన్‌ పేరెంట్లాంటి వారే. ఆయన నాతో ‘నువ్వు అంత తెలివైన దానివేం కాదు. అందుకే నువ్వు కూడా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగలవు’ అనేవారు. నా జీవితంపై నాన్న మాటల ప్రభావం చాలా ఉంది’’ అని ఆ ఇంటర్వ్యూలో సామ్‌ చెప్పుకొచ్చారు. 


తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ‘ఏ మాయ చేసావే’ అనే సినిమా ద్వారా అడుగు పెట్టింది సమంత. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకొని, మంచి పాపులారిటీ అందుకుంది. ఇక తర్వాత చాలామంది స్టార్‌ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. తన మొదటి సినిమా లో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడింది. . దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట, 2017లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఎంతో సంతోషంగా, క్యూట్‌ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న వీరు ‘మజిలీ’ సినిమా చేసి జంటగా విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. సమంత బాలీవుడ్‌ లో ‘ఫ్యామిలీ మెన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ చేసిన తర్వాత అనూహ్యంగా ఇద్దరూ 2021 అక్టోబర్‌ 2న విడాకులు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. దీంతో ఈ వెబ్‌ సిరీస్‌ లో భిన్నంగా నటించడం వల్లే సమంతకు నాగచైతన్య విడాకులు ఇచ్చారు అంటూ ఎన్నో రూమర్స్‌ వినిపించాయి.

ఇంకా చదవండి: చివరి షెడ్యూల్‌లో పవన్‌ కళ్యాణ్‌ జాయిన్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# సమంత     # జోసెఫ్‌ ప్రభు    

related

View More
View More

trending

View More