‘గొర్రె పురాణం’ సినిమాకి  విమర్శకుల అభినందనలు !

‘గొర్రె పురాణం’ సినిమాకి విమర్శకుల అభినందనలు !

2 months ago | 45 Views

టాలీవుడ్ నవతరం హీరో సుహాస్ ‘గొర్రె పురాణం’ చిత్రం ప్రమోషన్లలో కనిపించక పోవడంతో రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు సోషల్ మీడియాలో తమ అక్కసును వెళ్లగక్కుకున్నారు.ఈ ‘గొర్రె పురాణం’ సినిమా ప్రమోషన్లకు సంబంధించి పుకార్లు షికారు చేయడంతో ‘గొర్రె పురాణం”పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దాంతో సినిమా ఫలితంపై కూడా ఎంతగానో ప్రభావం పడిందని సినీప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేసారు. . ఫలితం ఎలా ఉన్నా తెలుగులో సెటైరికల్ సినిమాలు చేసే దర్శకులు చాలా అరుదు. ఇలాంటి సమయంలో బాబీ అనే దర్శకుడు ‘గొర్రె పురాణం’ సినిమాతో బోల్డ్ అటెమ్ట్ చేశారు. హిందీలో వచ్చిన పీపిలీ, పీకే చిత్రాలకు దగ్గరగా ఈ సినిమా ఉంది. ఇండియా సినిమాలో రాజ్ హిరానీ వంటి దర్శకులు చాలా కూడా చాలా ఆరుదు. గొర్రె పురాణం సినిమాతో దర్శకుడు బాబీ వారి వరుసలో చేరారని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ‘గొర్రె పురాణం’ సినిమాలో పోస్టర్ల మీద మొత్తం సుహాస్ కనిపించినా.. సినిమాలో ఆయన పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. దాని వలన మొదటి రోజు చూసిన ప్రేక్షకులు కొంత అసంతృప్తికి లోనయ్యారు. దాంతో మొదటి రోజు పబ్లిక్ టాక్ అంతంత మాత్రమే ఉన్నా.. క్రమంగా మంచి టాక్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ పరుగులు పెట్టింది. గొర్రెతో సినిమా చేయడం అంత చిన్న విషయం కాదు.. చెప్పడం మాటలు కాదు.. చేతలు కావాలి.

గొర్రెను ఒక పాత్రగా తెరపై చూపించడం అంటే ఎంత కష్టపడాలో అది మేకర్స్ కు మాత్రమే తెలిసిన విద్య. అలాంటిది ఎక్కడా వీఎఫ్ఎక్స్ వాడకుండా నిజమైన గొర్రెతో సినిమా తీసిన దర్శకుడి ప్రతిభను ప్రతీ ఒక్క సినిమా ప్రియుడు, విమర్శకుడు.. సాధారణ ప్రేక్షకుడు మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ విషయంలో దర్శకుడు బాబీ విజయం సాధించాడని ఖచ్చితంగా మెచ్చుకోవచ్చు. అందుకే దర్శకుడు బాబీకి ‘గొర్రె పురాణం” సినిమా విషయంలో మంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ‘గొర్రె పురాణం’ సినిమాకు సరైన పబ్లిసిటీ లేకపోయినా, హీరో సుహాస్ సపోర్ట్ ఇవ్వకపోయినా, ప్రేక్షకుల మౌత్ టాక్ తో , ఆధారంతో ముందుకు దూసుకెళ్తుంది. తాజాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటడం విశేషంగా చెప్పుకోవాలి. సినిమా చూస్తే ఎంత తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించారో అర్థమవుతుంది. ఈ బడ్జెట్లో ఇంత మంచి సెటైరికల్ సినిమా తీయడంలో డైరెక్టర్ బాబి సంపూర్ణగా విజయతీరం చేరాడని చెప్పొచ్చు. అయితే మలయాళం సినిమాల్లో కంటెంట్ ఉంటుందని, ల్యాగ్ ఉన్నప్పటికీ మన వాళ్ళు ఆదరిస్తారు. ఇదే ‘గొర్రె పురాణం’ సినిమా విషయంలో కంటెంట్ ఉంది కానీ, ల్యాగ్ ఉందని విమర్శిస్తున్నారు. అందరూ ఒక్క విషయన్ని ఆలోచించాలి ఇలాంటి సినిమాలు ఆదరించకపోతే కంటెంట్ ఉన్న సినిమాలు ఇక రావడం తగ్గుతాయని. ఇంత మంచి సినిమాను ఆదరించినప్పుడే మరిన్ని మంచి సినిమాలు బాబీ లాంటి దర్శకుడి చేతినుంచి థియేటర్లలో అడుగు పెట్టి ఊపిరిపోసుకుంటాయని గ్రహించాలి. హ్యాట్సాప్ టు బాబీ..

(నటీనటులు : సుహాస్‌, పోసాని కృష్ణమురళి, రఘు తదితరులు., దర్శకుడు : బాబీ, నిర్మాత : ప్రవీణ్‌రెడ్డి, సంగీత దర్శకుడు : పవన్ సి.హెచ్, సినిమాటోగ్రఫీ : సురేష్ సారంగం, బ్యానర్ : ఫోకల్ వెంచర్స్)

ఇంకా చదవండి: ఆస్కార్‌ బరిలో 'లాపతా లేడీస్‌' .. పుష్పరాణిగా నటించిన ప్రతిభారత్న ఆనందం

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# GorrePuranam     # Suhas     # PrasannaVadanam    

trending

View More