వైభవంగా జరిగిన క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, డాక్టర్ ప్రీతి వివాహం
1 month ago | 5 Views
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, డా. ప్రీతి చల్లా రిజిస్టర్ వివాహంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితల సమక్షంలో వారి వివాహం వైభవంగా జరిగింది. ప్రీతి సాంప్రదాయ పైథాని చీరలో అద్భుతంగా కనిపించారు. నూతన వధూవరులు అందమైన చిరునవ్వులు వేడుకని ప్రత్యేకంగా నిపిలి వారి కొత్త ప్రయాణానికి నాంది పలికాయి.
క్రిష్ జాగర్లమూడి అద్భుతమైన కథా నైపుణ్యం, శక్తివంతమైన కథనాలను అందించే సామర్థ్యం వున్న దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలని అందించడంలో క్రిష్ దిట్ట. సినిమా పట్ల తన ఆలోచనాత్మక విధానం, చరిత్ర, భావోద్వేగాలను సినిమా నైపుణ్యంతో మిళితం చేయడంలో అందరి ప్రశంసలు పొందారు.
ఈ ప్రత్యేకమైన రోజు, డాక్టర్ ప్రీతి చల్లాతో తన వ్యక్తిగత కథ- ప్రేమ, గౌరవం, కలలను పంచుకునే స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి ప్రధాన వేదికగా నిలిచింది. వివాహంతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, డాక్టర్ ప్రీతి లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంకా చదవండి: ‘దిల్ రాజు డ్రీమ్స్’ ద్వారా కొత్త టీంతో చిత్రాలను నిర్మిస్తా : ప్రముఖ నిర్మాత దిల్ రాజు
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# క్రిష్ జాగర్లమూడి # డా. ప్రీతి చల్లా