"కోర్ట్" చిత్రం చాలా రియలిస్టిక్ గా తీశాం,లాయర్ క్యారెక్టర్ చేసిన తరువాత వారి మీద రెస్పెక్ట్ పెరిగింది: హీరో ప్రియదర్శి

15 days ago | 5 Views

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అలానే ప్రేమలో పాట కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ప్రియదర్శి మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నారు. 

"కోర్ట్" సినిమా ప్రయాణం ఎలా మొదలైంది? 

2022లో నేను రామ జగదీష్ వేరే సినిమా చేస్తున్న టైం లో మండుటెండలో ఒక చెట్టు కింద కూర్చుని ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈసారి కచ్చితంగా ఒక మంచి సినిమా చేయాలి అనుకుంటూ ఉన్న సమయంలో రామ్ జగదీష్ ఒక ఐడియా ఉంది అని చెప్పారు. సరే కథ రాసుకొని రమ్మని చెప్పాను. ఒక ఆరు నెలలకి కథ మొత్తం రాసుకుని తీసుకోవచ్చాడు. ఇలాంటి కథలు ఇప్పుడు ఎవరు చేస్తారు అని అనుకుంటూ ఉన్న సమయంలోనే ఇది గనుక హిట్ అయితే ప్రేక్షకులకు గుర్తుండిపోయి సినిమా అవుతుంది అని గట్టి నమ్మకం కలిగింది. మళ్లీ నెక్స్ట్ సమ్మర్ కి నాని అన్నతో గోవాలో "హాయ్ నాన్న" సినిమా చేస్తున్న టైం లో ఈ కథ గురించి చెప్పినప్పుడు నాని అన్న ఈ కథ వింటాను అని చెప్పారు. తరువాత నాని గారు కథ విన్నారు, ఈ కథ మనం చేస్తున్నాం అని చెప్పారు. అలా స్టార్ట్ అయింది ఈ స్టోరీ. 

Court having Pushpa The Rule connection | cinejosh.com

లాయర్ పాత్రలో మొదట మిమ్మల్ని అనుకున్నారా? 

ఈ కథ చెప్పినప్పుడు అలానే రాసేటప్పుడు ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నా డు రామ జగదీష్. కానీ నేను ఈ క్యారెక్టర్ చేస్తానని బ్రతిమిలాడాను. సరే అని ఒప్పుకొని నాని గారి దగ్గరికి వెళ్లి చెప్పినప్పుడు అన్న కూడా అదే అన్నాడు.

ఇలాంటి కథలు బాలీవుడ్ లో ఎక్కువగా వస్తూ వుంటాయి, ఈ సినిమాలో ఎంతవరకు చట్టాలను అర్థమయ్యేలా చూపించగలిగారు?కేరక్టర్ కి ఎంత హోం వర్క్ చేశారు?

--ప్రతి కోర్టు రూమ్ డ్రామాలో ముఖ్యంగా మనకి ఎవిడెన్సెస్, ఫ్యాక్ట్స్ అలానే వాటికి అమలు అయ్యే చట్టాలు ఇవన్నీ కూడా మనకి కొంతమేరకు తెలియాలి.అలానే కొంత మంది లాయర్లు దగ్గరికి వెళ్లి పోక్సో కేసు అంటే ఏమిటి దానికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అలానే కొంతమంది జడ్జెస్ దగ్గరనుంచి కొన్ని జడ్జిమెంట్ స్వీకరించి వాటి నుంచి ఒక మెటీరియల్ తయారు చేశాడు రామ్ జగదీష్. అవి నాకు కూడా ఇచ్చాడు. 

--నేను కూడా రియల్ గా కోర్టులో లాయర్లు,జడ్జీలు  ఎలా ఉంటారు, ఎలాంటి బట్టలు వేసుకుంటారు, వారి భాష ఇలా ప్రతి ఒక్కటి చూసి ఎగ్జాక్ట్గా అలా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం.సెక్షన్లు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నాను.

--విజయవాడ లో ఉన్న కొన్ని జిల్లా కోర్టులకు వెళ్లి అక్కడ ఎలా ఉంటుంది అని చూసి మక్కి టు మక్కి విటల్ గారు దించేశారు. అదేవిధంగా ఫోక్సొ కోర్టు కూడా డిఫరెంట్ గా ఉంటుంది 2024 ముందు ఎలా ఉండేదో ఇంచుమించుగా అలాగే ఉండేలా జాగ్రత్తగా తీసుకున్నారు డైరక్టర్. ప్రతి ఒక్కటి కూడా రియలిస్టిక్ గా వుండేలా చూస్కున్నాం.జుడీషియరీ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి దానికి డిస్ రెస్పెక్ట్ తీసుకురావాలి అని మేము అనుకోలేదు.

-- ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు లాయర్లు మీద రెస్పెక్ట్ పెరిగింది.అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనకి ఎంతగా ఉపయోగపడుతుంది అని అర్థం అయింది.

"స్టేట్ vs ఏ నోబడి" క్యాప్షన్ పెట్టడానికి రీజన్ ఎంటి?

ఒకడు దొంగతనం చేసి పోలీసులకు దొరికితే,పోలీసులు ఆ దొంగ నేరస్తుడు అని ప్రూవ్ చేయాల్సిన అవసరం వుంది.అపుడు మనం కోర్టు బాషా లో చెప్పాలి అంటే స్టేట్ vs అక్యూసెడ్ అని అంటాం. చట్టానికి అందరూ ఒకటే అనే సైన్ తో అలా పెట్టాం.

సినిమాని లాయర్లకు చూపించరా?

ఎస్, కొంత మంది లాయర్లకు అలానే బార్ కౌన్సిల్ వారికి చూపిద్దాం అనుకుంటున్నాం. కొంత మంది బార్ కౌన్సిల్ మెంబెర్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలానే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా కలిసి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం.

-- పుష్ప 2 టైం జరిగిన ఇన్సిడెంట్ గురించి చూసుకుంటే కోర్టులో ఎలాంటి సిట్యువేషన్స్ జరిగాయో చూసాం. నిరంజన్ రెడ్డి గారు వాడిన బాష ఇలాంటివి అన్ని చూసి డబ్బింగ్ లో కూడా కొన్ని మార్పులు చేశాం.

నాని గారు ఈ సినిమా చూడండి నచ్చకపోతే నా సినిమా కూడా చూడటం మానేయండి అని అన్నారు దాని మీద మీ ఒపీనియన్?
అది ఆయనకు కథ మీద వున్న నమ్మకం. నాని గారు ఎంచుకునే కథలు కూడా అలానే వుంటాయి. నాని అన్న ఒక క్రెడిబుల్ అండ్ రిలయబుల్ యాక్టర్ స్క్రిప్ట్ చూజ్ చేసుకునే విషయంలో. అలాంటి వ్యక్తి కథ విన్నాక " మన దగ్గర ఒక గుడ్ కథ వుంది దానిని గ్రేట్ కథగా తీయాలి"అని అన్నారు.అలానే ఆయన సినిమా చూసాక " నేను ఏదో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది" అని అన్నారు.

డ్రీమ్ రోల్?
బయోపిక్ చేయాలని వుంది. శాంతా బయోటెక్ ఫౌండర్ అండ్ చైర్మన్ కే ఐ వరప్రసాద్ గారి బయోపిక్ చేయాలని ఎప్పటి నుంచో వుంది.
--- కోర్టు సినిమాకి పెట్టిన డబ్బుల కంటే ఎక్కువ వస్తె నేను కమర్షియల్ హీరో అని అనుకుంటాను.మంచి సినిమాకి పైసలు వస్తె అది కమర్షియల్ హిట్.నా లాంటి నటులు మంచి కథలు చేస్తేనే థియేటర్ లకి జనాలు వస్తారు లేదంటే రారు.
వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్,
ప్రొడ్యూసర్స్ గురించి ఎం చెప్తారు?

ప్రశాంతి గారు,దీప్తి గారు మాకు అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు,అవసరం అయిన అన్ని సమకూర్చారు.సెట్స్ లో మాతో పాటు ఉండేవారు.నాని గారు మాత్రం అప్పుడప్పుడు రషెస్ చూసి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తూ ఉండే వారు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
సారంగపాణి జాతకం ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది 
ప్రేమంటే చేస్తున్నాను,గీత ఆర్ట్స్ లో కూడా ఒక ఫిలిం సైన్ చేశాను 

ఆల్ ది బెస్ట్ 
థాంక్ యూ
ఇంకా చదవండి: డైలాగ్ కింగ్ సాయి కుమార్ కి కొమరం భీమ్ జాతీయ పురస్కారం
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# నాని     # కోర్ట్    

trending

View More