నా పై వార్తలు రాసే ముందు సంప్రదించరా : డేటింగ్‌పై సోషల్‌ విూడియా ప్రచారంపై కృతి ఆగ్రహం

నా పై వార్తలు రాసే ముందు సంప్రదించరా : డేటింగ్‌పై సోషల్‌ విూడియా ప్రచారంపై కృతి ఆగ్రహం

4 months ago | 36 Views

తనకంటే 10 ఏళ్ల చిన్న వ్యక్తితో డేటింగ్‌ చేస్తున్నట్లు వచ్చిన రూమర్స్‌ ఎంతో బాధించాయని నటి కృతిసనన్‌ అన్నారు. యూకేకు చెందిన కబీర్‌ బహియాతో కృతి డేటింగ్‌ చేస్తున్నట్లు ఇటీవల కొన్ని రూమర్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పుట్టినరోజు వేడుకను కబీర్‌తో కలిసి చేసుకున్నారని ఊహాగానాలు వినిపించాయి. వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. ’నా గురించి తప్పుడు సమాచారాన్ని రాసినప్పుడు నాతో పాటు నా కుటుంబం కూడా బాధపడుతుంది. దాని వల్ల వచ్చే పరిణామాలు మేమంతా ఎదుర్కోవాలి. ఎలాంటి వార్తలైనా సోషల్‌ విూడియా ద్వారా త్వరగా ప్రజల్లోకి వెళ్తాయి. అవి నిజమని భావించి ఎంతోమంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ అబద్దాల గురించి నిరంతరం స్పందించాలంటే చికాకు వేస్తోంది.

అన్నిటికంటే ఇది ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ’34 ఏళ్ల కృతి తన కంటే 10 ఏళ్ల చిన్న వ్యక్తితో డేటింగ్‌ చేస్తోంది’ ఈ హెడ్డింగ్‌ ఎంతో మంది ఉపయోగించారు. ఏ మాత్రం నిజానిజాలు తెలుసుకోకుండా వారి ఇష్టం వచ్చినట్లు రాసేశారు. ఇలా రాయడం ఈరోజుల్లో కామన్‌ అయిపోయింది. గతంలో సోషల్‌ విూడియా లేనప్పుడు వార్తపత్రికల్లో వచ్చింది చూసి ప్రజలు ఓ అభిప్రాయానికి వచ్చేవారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారు. నెగెటివ్‌ కామెంట్స్‌ పెట్టడం ట్రెండ్‌ అయిపోయింది. వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడం.. అవతలి వారిపై రూమర్స్‌ క్రియేట్‌ చేయడం ఒకటి కాదు’ అంటూ కృతి అసహనం వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి: గూగుల్‌ను అడిగితే నా గురించి చెబుతుంది: స్విట్జర్లాండ్‌ విూడియాతో షారూఖ్‌ సరదా వ్యాఖ్యలు

# KritiSanon     # Socialmedia    

trending

View More