'మిస్టర్‌ బచ్చన్‌' సాంగ్‌పై కామెంట్స్‌.. గట్టిగా సమాధానం ఇచ్చిన హరీష్‌ శంకర్‌

'మిస్టర్‌ బచ్చన్‌' సాంగ్‌పై కామెంట్స్‌.. గట్టిగా సమాధానం ఇచ్చిన హరీష్‌ శంకర్‌

5 months ago | 52 Views

రవితేజ హీరోగా హరీశ్‌ శంకర్‌ 'మిస్టర్‌ బచ్చన్‌’  సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. క్యాడ్‌బరీ యాడ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన 'సితార్‌ సాంగ్‌’ ను ప్రచారంలో భాగంగా చిత్రబృందం విడుదల చేసింది. సాహిత్యం బాగుందంటూ పలువురు శ్రోతలు నెట్టింట పెట్టిన పోస్ట్‌లపై శంకర్‌ స్పందిస్తూ వారికి థ్యాంక్స్‌ చెప్పారు.


మరోవైపు, రవితేజ, భాగ్యశ్రీల మధ్య వయసు వ్యత్యాసాన్ని హైలైట్‌ చేస్తూ.. ఫిల్మ్‌మేకర్స్‌ హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ఈ పాటలో ఆమె ఫేస్‌ని చూపించే ప్రయత్నం చేయలేదు అని ఒకరు కామెంట్‌ చేశారు. దానిపై హరీశ్‌ స్పందించారు. విూరు కనుగొన్న దానికి కంగ్రాట్స్‌. విూరు నోబెల్‌ ప్రైజ్‌కు అప్లై చేస్తే బాగుంటుంది. ఇలానే విూ పని కొనసాగించండి. మేం స్వాగతిస్తాం అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాట యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ సొంతం చేసుకుంది. రవితేజ-హరీశ్‌ కాంబోలో ఇంతకుముందు 'షాక్‌’, 'మిరపకాయ్‌’ చిత్రాలొచ్చిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి: హైదరాబద్‌లో తొలిసారి దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో.. #dspliveindiatour ప్రకటించిన రాక్‌స్టార్ dsp

# Mr.Bachchan     # RaviTeja     # AmitabhBachchan     # August15    

trending

View More