ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసి చెక్కుని అందజేసిన కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, విష్ణు మంచు
2 months ago | 5 Views
ఏపీ, తెలంగాణలో వచ్చిన వరదలు, కలిగిన అపార నష్టం గురించి అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా టాలీవుడ్ నిలిచింది. టాలీవుడ్ ప్రముఖులంతా కూడా విరాళాలను అందించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వంగా కలిసి విరాళానికి సంబంధించిన చెక్కుని కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, విష్ణు మంచు అందజేశారు.
వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వానికి రూ. 25 లక్షల విరాళాన్ని మోహన్ బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ చెక్కుని అందజేసేందుకు సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం చంద్రబాబుతో మోహన్ బాబు కుటుంబానికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం ఇలా చెక్కుని అందజేశారు.
ఇంకా చదవండి: ‘దేవర’గా ఎన్టీఆర్ ఇరగదీశారు.. సినిమాను ఇంతలా ఆదరిస్తోన్న అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు : నందమూరి కళ్యాణ్ రామ్