చియాన్ విక్రమ్ నటన అదుర్స్.. 'తంగలాన్'పై ప్రేక్షకుల ఛీర్స్!
4 months ago | 39 Views
విలక్షణతకు మారు పేరు చియాన్ విక్రమ్. తను గతంలో నటించిన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి చిత్రాలెన్నో ఆయన ప్రత్యేకతకు అద్దం పడుతుంటాయి. ఆ కోవలోనే తాజాగా వచ్చిన చిత్రం 'తంగలాన్’. రజనీకాంత్‌తో కబాలి, కలా వంటి చిత్రాలను రూపొందించిన పా రంజిత్ ఈ సినిమాకు దర్శకుడు. ఆగష్టు 15 స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సినిమా విడుదలవడంతో అనేక మంది మూవీని చూసి తమ అభిప్రాయాలను సోషల్ విూడియా వేదికగా పంచుకుంటున్నారు. విక్రమ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రమని, విక్రమ్ నటనకు ఓ దండం అంటూ చాలా మంది హ్యాట్సాప్ చెబుతున్నారు. మరికొంతమంది ఓ మెట్టు పైకెక్కి విక్రమ్ ఓ పది మంది కమల్‌హాసన్‌లను చూసినట్లుగా ఉందని కొనియాడుతున్నారు.
పార్వతి, మాళవికల నటన న్యాచురల్‌గా ఉందని, పా రంజిత్ తీసుకున్న స్జబెక్ట్ ఎక్సలెంట్‌గా ఉందంటున్నారు. సినిమా కోరాల్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యం కేజీఎఫ్ కన్నా బాగా చేయించారని పోస్టు చేస్తున్నారు. అదేవిధంగా జీవీ ప్రకాశ్ సంగీతం సినిమా స్థాయిని రెట్టింపు చేసిందని ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉందంటూ చాలామంది సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. తమిళనాట అయితే అభిమానుల సందడి వీర లెవల్‌లో ఉంది, విక్రమ్‌కు అస్కార్ వచ్చేస్తుందనేలా కామెంట్లు చేస్తున్నారు. ఈ మూవీ తమిళ బాహూబలి అని పేరు పెట్టేస్తున్నారు.
ఇంకా చదవండి: హరీష్ శంకర్ మార్క్ కనిపించని సాదాసీదాగా సాగిన 'మిస్టర్ బచ్చన్'
# Thangalan # Chiyaanvikram # Malavikamohanan