కష్టాలను నవ్వుతూ ఎదుర్కోవాలి..  నవీన్‌ పోలిశెట్టి తాజా వీడియో విడుదల!

కష్టాలను నవ్వుతూ ఎదుర్కోవాలి.. నవీన్‌ పోలిశెట్టి తాజా వీడియో విడుదల!

4 months ago | 82 Views

'జాతిరత్నాలు' ఫేమ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టికి ఇటీవలే అమెరికాలో యాక్సిడెంట్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన చేతికి, కాలికి ఫ్రాక్చర్‌ అయింది. తనకు జరిగిన ప్రమాదంపై, తాను ఉన్న పరిస్థితిపై తన ఫ్యాన్స్‌ కోసం ఇటీవలే సోషల్‌ విూడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమాదం నుంచి..కోలుకునే ప్రక్రియ  కాస్త నెమ్మదిగా సాగుతోందని నవీన్‌ పోలిశెట్టి వెల్లడించారు.  తాజాగా నవీన్‌ పొలిశెట్టి అభిమానుల కోసం చేతికి కట్టుతో ఉన్న కొత్త వీడియోను షేర్‌ చేశాడు. 'లైఫ్‌ ఒక జిందగీ అయిపోయింది..'త్వరలో కలుద్దాం జానే జిగర్స్‌’ అంటూ క్యాప్షన్‌ తో ప్రస్తుత హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ’సింగిల్‌ హ్యాండ్‌ గణెశ్‌’ అంటూ వెంకటేశ్‌ చెప్పిన డైలాగు..'చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో’ అని చిరంజీవి చెప్పిన డైలాగులను టీవీలో పెట్టుకొని తనను తానే ట్రోల్‌ చేసుకుంటూ నవ్వులు పూయించారు. అలాగే మరికొన్ని విూమ్స్‌ తో ఫ్యాన్స్‌ ను నవ్వించే ప్రయత్నం చేస్తూనే ప్రస్తుతం తాను పడే కష్టాన్ని చూపెట్టాడు.

ఇక చివర్లో 'జీవితంలో వచ్చిన కష్టాలను నవ్వుతూ ఎదుర్కోవాలి. ’హాస్యమే మనకు ధైర్యాన్నిస్తుంది. విూ అందరినీ నవ్వించడం నాకెంతో ఇష్టం. పూర్తిగా కోలుకున్న తర్వాత బిగ్‌ స్క్రీన్‌పై విూ అందరినీ కలుస్తాను’ అని వీడియోలో రాసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇటీవలే 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పిలిశెట్టి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నవీన్‌ డీసెంట్‌ హిట్‌ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత అనగనగా ఒకరాజు అనే సినిమా చేస్తున్నారు నవీన్‌. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాలో లేటెస్ట్‌ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ఈ సినిమా కాకుండా మరో రెండు క్రేజీ సినిమాలను కూడా లైన్లో పెట్టాడు నవీన్‌ పోలిశెట్టి.

ఇంకా చదవండి: ‘శివం భజే’ నా కెరీర్‌లో బెస్ట్ చిత్రం.. సక్సెస్ మీట్‌లో హీరో అశ్విన్ బాబు

# Missshettymr.polishetty     # Naveenpolishetty     # Anushkashetty    

trending

View More