'అమరన్‌ అసురన్‌'లో సెల్‌ నంబర్‌ ... నిర్మాతకు విద్యార్థి లీగల్‌ నోటీసులు!

'అమరన్‌ అసురన్‌'లో సెల్‌ నంబర్‌ ... నిర్మాతకు విద్యార్థి లీగల్‌ నోటీసులు!

1 month ago | 5 Views

అపరిచితుల నుండి ఫోన్‌కాల్స్‌ వస్తుండటంతో చెన్నైకి చెందిన వి.వి వాగీశన్‌ అనే ఇంజినీరింగ్‌ విద్యార్థి అమరన్‌  నిర్మాతలకు లీగల్‌ నోటీసులు పంపాడు. దీనిక్కారణం సినిమాలోని ఓ సీన్‌ కావడం గమనార్హం. ఇంతకీ విషయమేంటంటే అమరన్‌లో కొన్ని సెకన్ల పాటు సాగే సన్నివేశంలో సాయి పల్లవి తన ఫోన్‌ నంబర్‌ వ్రాసిన నలిగిన కాగితాన్ని విసురుతుంది. అయితే ఈ సీన్‌తోనే విద్యార్థికి కష్టాలు మొదలయ్యాయి. ఆ ఫోన్‌ నంబర్‌లో ఒక అంకె స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ.. ఆ నంబర్‌ మాత్రం సదరు విద్యార్థి ఫోన్‌ నంబర్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీంతో చాలా మంది సాయిపల్లవితో మాట్లాడొచ్చనే ప్రయత్నంలో ఆ నంబర్‌కు ఫోన్‌ చేశారు.


అయితే రిపీటెడ్‌గా కాల్స్‌ వస్తుండటంతో వాగీశన్‌ తన ఫోన్‌ను మ్యూట్‌ చేశాడు. ఆ తర్వాత కొన్ని వాయిస్‌ మెసేజ్‌లు విన్న తర్వాత తన మొబైల్‌ నంబర్‌ అమరన్‌ స్క్రీన్‌పై చూపించినట్టు నిర్దారణకు వచ్చాడు. ఫోన్‌ కాల్స్‌ తనకు తీరని కష్టాలు తెచ్చిపెట్టడమే కాకుండా మానసిక వేదనకు గురి చేస్తుండటంతో.. దీనికి పరిష్కారం చూపించాలని కోరుతూ  వాగీశన్‌  డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ పెరియస్వామి, హీరో శివకార్తికేయన్‌ ని సోషల్‌ విూడియాలో ట్యాగ్‌ చేశాడు. అయితే దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో తనకు రూ. 1 కోటి నష్టపరిహారంగా ఇవ్వాలని పరువు నష్టం దావా వేశాడు. తన ఆధార్‌, బ్యాంక్‌ కార్డ్స్‌తో ఇతర అకడమిక్‌ ప్లాట్ ఫామ్స్‌తో ఫోన్‌ నంబర్‌ లింక్‌ అయి ఉన్న నేపథ్యంలో.. తన ఫోన్‌ నంబర్‌ మార్చబోనని వాగీశన్‌ చెబుతున్నాడు. మరి వాగీశన్‌ దావాపై అమరన్‌ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇంకా చదవండి: యాడ్‌ కోసం కొత్త లుక్‌లో మహేశ్‌!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# అమరన్‌     # శివకార్తికేయన్‌     # సాయిపల్లవి    

trending

View More